Bigg Boss Telugu 3 Episode 18: అలీ కాళ్లు పట్టుకున్న హిమజ… రవి చేతికి గాయం..!

-

ఇంటి సభ్యులకు ఆ టాస్క్ గురించి ఏం అర్థమయిందో… బిగ్ బాస్ ఎం చెప్పాడో… వాళ్లు చేసేదేందో… జనాలు మాత్రం బిగ్ బాస్ ను చూడలేక టీవీలను ఆఫ్ చేసేస్తున్నారు.

ఓరి దేవుడోయ్.. ఇదేం టాస్క్ బిగ్ బాస్. ఇంటి సభ్యులు ఏం టాస్క్ చేస్తున్నారో.. ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బిగ్ బాస్ మొన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు. దొంగలున్నారు జాగ్రత్త అనేది ఆ టాస్క్ పేరు. తికమకపురం అనే గ్రామంలో ఈ టాస్క్ జరుగుతుంది. కానీ… ఆ టాస్క్ మాత్రం అంతా గందరగోళంగా ఉంది.

ఇంటి సభ్యులకు ఆ టాస్క్ గురించి ఏం అర్థమయిందో… బిగ్ బాస్ ఎం చెప్పాడో… వాళ్లు చేసేదేందో… జనాలు మాత్రం బిగ్ బాస్ ను చూడలేక టీవీలను ఆఫ్ చేసేస్తున్నారు. ఆ టాస్క్ లో ఏమాత్రం ఫన్ జనరేట్ అవడం లేదు.

హహహ.. అంటూ గట్టిగా అరుస్తూ శ్రీముఖి ప్రవర్తించే తీరు అయితే జనాలకు అస్సలు నచ్చడం లేదు. మరోవైపు అలీ, హిమజ మధ్య నీళ్ల దగ్గర గొడవ. చివరకు హిమజ… క్షమించమంటూ కోరుతూ అలీ కాళ్లు పట్టుకుంటుంది.

శ్రీముఖి, రాహుల్ మధ్య ఇంకో గొడవ. మహేశ్ విట్ట… మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా ప్రవర్తిస్తున్నాడు. ఓవైపు శ్రీముఖిని రెచ్చగొట్టడం.. మరోవైపు వరుణ్ దగ్గరికి వచ్చి… శ్రీముఖి గురించి చెప్పడం… ఊసరవెల్లిలా ఉంది ఆయన ప్రవర్తన.

పోలీసులా యాక్ట్ చేస్తున్న బాబా భాస్కర్.. శ్రీముఖికి మద్దతు ఇవ్వడం… ఇలా టాస్క్ అంతా ఏకపక్షంగా ఉంది అని చెప్పొచ్చు.

ఎలాగైనా ఈ టాస్క్ లో గెలిచి… కెప్టెన్ అవ్వాలని శ్రీముఖికి బాగా ఆశగా ఉందని ఈ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. అందుకే.. వరుణ్ ను మాటల్లో పెట్టి.. ఆయన దగ్గర ఉన్న డబ్బు కొట్టేస్తుంది. ఆ తర్వాత డంబెల్ తీసుకొచ్చి.. దానితో నిధి ఉన్న గ్లాస్ ను పగులగొడుతుంది.

అందులోని నిధిని తీసే క్రమంలో రవి చేతికి గాయం అవుతుంది. ఈ గాయం వల్ల మళ్లీ ఇంట్లో గొడవ ప్రారంభం అవుతుంది. రవిని చేతిలో కొట్టాలంటూ శ్రీముఖి.. రవిని పురమాయించిందని వితిక ఆరోపించగా… తాను డంబెల్ తో కొట్టాలని చెప్పాను కానీ.. చేతితో కొట్టాలని కాదు అని శ్రీముఖి చెబుతుంది.

వెంటనే రవిని బిగ్ బాస్ మెడికల్ రూమ్ కు పిలుస్తాడు. డాక్టర్ వచ్చి రవికి ట్రీట్ మెంట్ చేస్తాడు. రవికి గాయం కావడంతో తమ వద్ద ఉన్న నిధిని తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు వరుణ్. దాంతో 17వ ఎపిసోడ్ పూర్తవుతుంది. చూద్దాం.. ఇవాళ ఏం జరుగుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news