బిగ్ బాస్ గెలుపు ఫార్ములా: వీటిని జయించినవాళ్లే బిగ్ బాస్ విజేత

-

తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కూడా ఇటీవలే ప్రారంభం అయింది. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఉండటం అంటే మామూలు విషయం కాదు. అది కూడా కెమెరాల మధ్య. క్షణం కూడా కెమెరాల నుంచి తప్పించుకోలేరు. 100 రోజుల పాటు కెమెరాలు నిఘా పెట్టి చూస్తుండగా… ఆ ఇంట్లో గడపడం అంటే అది సవాల్ తో కూడుకున్న పనే.

బిగ్ బాస్.. ఇదేదో టైమ్ పాస్ కోసం సృష్టించిన షో కాదు. ఊరికే సృష్టించిన షో కాదు. దీని వెనుక పెద్ద సైన్స్ ఉంది. నిజానికి ఈ షో ఫారెన్ లో ఎప్పుడో ప్రారంభం అయింది. అక్కడ ప్రారంభం అయిన షోనే హిందీలో కాపీ కొట్టి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ప్రారంభించారు. హిందీలో ఆ షోలో సక్సెస్ ఫుల్ అవడంతో ప్రాంతీయ భాషల్లో కూడా ప్రారంభించారు. చివరకు తెలుగులో కూడా బిగ్ బాస్ షో ప్రారంభం అయింది.

తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కూడా ఇటీవలే ప్రారంభం అయింది. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఉండటం అంటే మామూలు విషయం కాదు. అది కూడా కెమెరాల మధ్య. క్షణం కూడా కెమెరాల నుంచి తప్పించుకోలేరు. 100 రోజుల పాటు కెమెరాలు నిఘా పెట్టి చూస్తుండగా… ఆ ఇంట్లో గడపడం అంటే అది సవాల్ తో కూడుకున్న పనే.

నిజానికి బిగ్ బాస్ షో అనేది డచ్ బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షో నుంచి వచ్చింది. దాన్ని ప్రేరణగా తీసుకొని బిగ్ బాస్ షోను డిజైన్ చేశారు. డచ్ బిగ్ బ్రదర్ షో ఏంటంటే… అది కూడా ఒక గేమ్ షోనే. ఆ షోలో కంటెస్టెంట్ సహనం, భావేద్వేగం, సహజత్వాన్ని టెస్ట్ చేస్తారు.

ఇక.. బిగ్ బాస్ షో వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే.. హౌస్ లో ఉన్న కొన్ని రోజులు అంతా బాగానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ప్రైవసీ లేక కంటెస్టెంట్లలో సహనం తగ్గిపోతుంది. కెమెరాలు, మైక్రోఫోన్లు కంటెస్టెంట్ల సహనాన్ని పరీక్షిస్తుంటాయి. కంటెస్టెంట్ ఎంత సహనంతో ఉంటే అంత ఎక్కువ ఓట్లు పడుతాయన్నమాట.

బిగ్ బాస్ విన్నర్ ఫార్ములా

చివరగా.. బిగ్ బాస్ విన్నర్ ఫార్ములా ఏంటంటే… సహనం(పేషెన్స్) + సహజత్వం(స్పాంటెనిటీ) = సానుభూతి(సింపతీ) = ఎక్కువ ఓట్లు = విన్నర్.
అది బిగ్ బాస్ వెనుక ఉన్న అసలు రహస్యం.

Read more RELATED
Recommended to you

Latest news