ఈ వారం ఎలిమినేష‌న్‌: బిగ్‌బాస్ అస‌లు దెబ్బంటే ఇదే క‌దా…

-

బిగ్‌బాస్‌ పన్నెండో వారం ముగింపుకు వచ్చినప్పటికీ అసలైన మజా రావటం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే ఈ షోపై చాలా మంది విమ‌ర్శ‌లే వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి కొంద‌రు అయితే షో చూస్తుంటే నిద్ర వ‌స్తుంద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక ఈ వారం వీకెండ్ వ‌చ్చేసింది. ఆదివారం షో నుంచి ఎవ‌రు ?  ఎలిమినేట్ అవుతార‌న్న‌దానిపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఎప్పటిలానే ఈ సారికూడా ఎలిమినేషన్‌లో పెద్ద సస్పెన్స్‌ ఉన్నట్టు కనిపించడం లేదు.

ఈ వారం ఎలిమినేష‌న్ జోన్లో ఉన్న వ‌రుణ్ సందేశ్‌, మ‌హేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్‌ల‌లో మ‌హేష్ విట్టా బిగ్‌బాస్ హౌస్‌ను వీడుతున్న‌ట్టు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక మ‌హేష్ చేజేతులా ఈ ఎలిమినేష‌న్లో మిగిలిన కంటెస్టెంట్ల ఫ్యాన్స్‌కు టార్గెట్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. అంద‌రితోనూ క‌లిసి ఉంటున్న‌ట్టు న‌టిస్తూ ఇక్క‌డ‌వి అక్క‌డ‌…. అక్క‌డ‌వి ఇక్క‌డ చెప్ప‌డ‌మే అత‌డికి మైన‌స్ అయ్యింది. దీంతో అత‌డికి బ‌య‌ట నార‌దుడు అన్న ముద్ర ప‌డిపోయింది.

ఇప్పుడు అత‌డిని అంద‌రూ దూరం పెట్టారు. మ‌హేష్‌కు వ్య‌తిరేకంగా స‌హ‌జంగానే పున్ను, వితిక‌, వ‌రుణ్‌, రాహుల్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తారు. ఇక శ్రీముఖిని టార్గెట్ చేయ‌డంతో ఇప్పుడు శ్రీముఖి ఫ్యాన్స్ అంద‌రూ మ‌హేష్‌కు యాంటీగా ఓట్లు వేసి క‌సితీరా అత‌డిని ఇంటికి పంపేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అటు బాబాతోనూ సఖ్యతగా ఉండకపోవటం వల్ల అతని అభిమానులు కూడా మ‌హేష్‌పై గుర్రుగా ఉన్నారు.

ఇక ఇప్ప‌టికే త‌న‌కు ఇంటికి వెళ్లిపోతాన‌ని అర్థ‌మ‌వ్వ‌డంతో తాను వెళ్లిపోయినా త‌న‌తో పాటు డ‌బుల్ ఎలిమినేష‌న్లో భాగంగా ఇంటి నుంచి మ‌రొక‌రు బ‌య‌ట‌కు రావాల్సిందే అని మంకు ప‌ట్టుమీద ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news