శ్రీముఖి కోసం బిగ్‌బాస్ పాట్లు మూములుగా లేవుగా…

-

బిగ్ బాస్ సీజన్-3 లో విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్న కంటెస్టంట్స్ లో శ్రీముఖి ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆమెకు పోటీగా రాహుల్ నిలుస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్ గా నిలిచే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలోనే బిగ్ బాస్ ఇంటి లోని ఐదుగురు సభ్యుల జర్నీ మొత్తం చూపించారు. ఈ జర్నీల ఎపిసోడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఆయా సభ్యుల జర్నీ చూపించే ముందు… బిగ్ బాస్ వారిని పొగడ్తలతో ముంచెత్తారు.

అయితే అందరి జర్నీ గురించి చెబుతూ…పొగడ్తల వర్షం కురిపించిన బిగ్ బాస్ శ్రీముఖిని కాస్త ఎక్కువ ఎలివేట్ చేసినట్లు కనబడుతుంది. గురువారం ఎపిసోడ్లో ఆమె జర్నీ వీడియో చూపించే ముందు బిగ్ బాస్ మాట్లాడుతూ… శ్రీముఖి మీరు ఈ ఇంట్లోకి రాక ముందు ప్రేక్షకులు మిమ్మిల్ని తెరపై మాత్రమే చూసి అభిమానులుగా మారారని, కాని.. బిగ్ బాస్ ఇంట్లో ప్రయాణం మిమ్మల్ని ప్రతి ఇంట్లో అమ్మాయిగా మార్చిందని అన్నాడు. ఇక నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, అల్లరి చేసే ఈ శ్రీముఖిని ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా ప్రేమించారని చెప్పాడు. శ్రీముఖి కోసం బిగ్‌బాస్ పాట్లు మామూలుగా లేవు.

అలాగే అవకాశం వచ్చిన ప్రతిసారి ఎలాంటి ప్రక్రియలోనైనా వంద శాతం ఎఫర్ట్ పెట్టారని, కొన్నిసార్లు మీ ఉత్సాహం కారణంగా మిమ్మల్ని టార్గెట్ కూడా చేశారని తెలిపాడు. మీ ప్రయాణంలో మీరు నమ్మినదాన్ని తప్పు అనిపిస్తే గట్టిగా వినిపించారని, ఎన్నో ఆటుపోట్ల ప్రయాణం ఆఖరి దశకు చేరిందని వివరించాడు. ఇక బిగ్ బాస్ మాటలతో శ్రీముఖి ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది. ఇలాంటి ఫీలింగ్ లైఫ్ లో ఎప్పుడు రాలేదని, చాలా హ్యాపీగా ఉందని, లవ్ యూ బిగ్ బాస్ అంటూ ముద్దుల వర్షం కురిపించింది. మరి చూడాలి ఈ బిగ్ బాస్ ఎలివేషన్ వల్ల శ్రీముఖికు ఓటింగ్ ఎంత పాజిటివ్ గా వస్తుందో.?

Read more RELATED
Recommended to you

Latest news