బిగ్‌బాస్‌లో అదిరిపోయే ట్విస్ట్‌: నామినేష‌న్లో ఏడుగురు

-

బిగ్ బాస్ సోమవారం నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా సాగింది. ఆదివారం ఎపిసోడ్లో మహేష్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇంటిలో మిగిలిన ఏడుగురు సభ్యులకు నామినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే ఈ వారం నామినేషన్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘టాపర్ ఆఫ్ ది హౌస్’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం ఒక బౌల్ లో ఏడు నెంబర్లు రాసి ఉంటాయి. వాటిని ఒక్కో సభ్యుడు తీసుకుని, ఏ నెంబర్ వచ్చిన వ్యక్తి ఆ నెంబర్ స్థానంలో నిలబడాల్సి ఉంటుంది.

దీంతో అందరు బౌల్ లో నెంబర్లు తీసుకోగా, 1. బాబా భాస్కర్, 2. రాహుల్, 3. వరుణ్ సందేశ్, 4. అలీ, 5. శివజ్యోతి, 6. వితికా షెరు, 7. శ్రీముఖిలకు వరుసగా వచ్చాయి. ఇక 1-3 నెంబర్లలో ఉన్నవారు నామినేషన్ లో ఉండరు. 4-7 వరకు ఉన్నవారు నామినేట్ అవుతారు. అయితే నామినేషన్ లో ఉన్నవారు…టాప్ 3 లో ఉన్నవారితో వాదించి ఆ నెంబర్ తీసుకోవచ్చు. టాప్-3లో ఉన్నవారి కంటే తామే బెటర్ అని చెప్పుకోవాలి. అటు టాప్3 లో ఉన్నవారు కూడా, తాము కూడా బెటర్ అని వాదించుకోవాలి.

దీంతో మొదట వితికా చర్చ మొదలుపెట్టి టాప్3 లో ఉన్నవారితో వాదించింది. ఇందులో బాబా, రాహుల్ లు వితికా వాదనని అంగీకరించలేదు. ఇక చివరికి వితికా , వరుణ్ తో వాదించింది. దీంతో 3 నెంబర్ లో ఉన్న వరుణ్ తన స్థానాన్ని వితికాకు ఇచ్చేసి తాను 6 నెంబర్ లోకి వెళ్ళాడు. అలా నెక్స్ట్ శ్రీముఖి రాహుల్ తో వాదించిన పెద్దగా ప్రయోజనం దక్కలేదు. చివరికి బాబాతో చర్చ చేయగా, ఆయన నెంబర్1 స్థానాన్ని శ్రీముఖి కోసం త్యాగం చేసి, తను 7వ స్థానంలోకి వెళ్ళాడు. తర్వాత అలీ 2వ స్థానంలోకి వస్తే, రాహుల్ 4వ స్థానంలోకి వెళ్ళాడు.

అయితే తర్వాత నెంబర్ 3 స్థానాన్ని వరుణ్ తన భార్యకు త్యాగం చేయడంతో శివజ్యోతి ఫుల్ ఫైర్ అయింది. తానూ నంబర్ 3 స్థానంలో ఉంటా అని భార్య, భర్తలతో వైరానికి దిగింది. ఇక వీరి వాదన ఎంతటికి తగ్గకపోవడంతో..బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇస్తూ….ఏడుగురు సభ్యులని నామినేషన్ లో పెట్టాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ జోన్లోకి ఏడుగురు సభ్యులు వెళ్లారు. మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news