సొరకాయ కూరను వెరైటీగా తింటే..!

-

సొరకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం కాబట్టి పోషకాలు ఎక్కువనే ఉంటాయి. అయితే దీనిని తినడానికి చాలామంది ఇష్టపడరు. వారానికి ఒకసారైనా సొరకాయ కూర తింటే కడుపు చల్లగా ఉంటుంది. సొరకాయను వెరైటీ రుచులలో వండితే చాలా ఇష్టంగా తింటారు.


కావాల్సినవి :
సొరకాయ : అరకిలో
పచ్చిమిర్చి : 5
ఆవాలు : 2 టేబుల్‌స్పూన్లు
కొబ్బరి తురుము : 1 కప్పు
బియ్యం : పావు కప్పు
నువ్వులు : 1 కప్పు
కారం : 1 టీస్పూన్
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత

తయారీ :
సొరకాయ తొక్కుతీసి ముక్కలుగా కోయాలి. పచ్చి వాసన పోయే వరకు ముక్కల్ని ఉడికించి దించేయాలి. తర్వాత నీరు వంపేయాలి. బియ్యం,నువ్వులు విడివిడిగా గంట చొప్పున నానబెట్టాలి. తర్వాత ఈ రెండింటినీ రెండు టీస్పూన్ల ఆవాలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు చేర్చి రుబ్బాలి. కడాయిలో నూనె వేసి కొద్దిగా ఆవాలు వేసిన తర్వాత సొరకాయ ముక్కలు వేసి 10 నిమిషాలు వేయించాలి. తర్వాత బియ్యం, నువ్వులు అన్ని కలిపి రుబ్బిన మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఒక స్పూన్ కారం వేసి మూతపెట్టి పది నిమిషాలపాటు సన్నని సెగపై ఉంచి చివరగా కొంచెం కొత్తిమీర చల్లాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ ఆవకూర రెడీ.

Read more RELATED
Recommended to you

Latest news