బిగ్‌బాస్‌ సీజన్ 3 విన్నర్ రాహుల్.. ఎన్ని ఓట్ల మెజార్టీ అంటే..?

-

తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నిన్నటి (ఆదివారం) ఎపిసోడ్‌తో ఘనంగా ముగిసింది. ముందుగా ఊహించినట్టుగానే రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు. మెగాస్టార్‌ చిరంజీవి చేతులమీదుగా ఆయన ట్రోఫీని అందుకున్నాడు. మ‌రియు రూ.50 లక్షల ప్రైజ్‌ మనీని గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. అటు సోషల్ మీడియా, ఇటు బుల్లితెర ప్రేక్షకులు కూడా శ్రీముఖి విజయం సాధించడం ఖాయమనుకున్నారు. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అత్యధిక ఓట్ల మెజార్టీతో రాహుల్ విన్ అయ్యాడు.

అదే విధంగా.. నాగార్జున కూడా ఈసారి మొత్తం 8 కోట్ల 52 లక్షల ఓట్లు పోలయ్యాయని చెప్పాడు. రాహుల్‌కి అత్యధికంగా 35 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. శ్రీముఖికి 28 శాతం, బాబా భాస్కర్‌కు 16%, వరుణ్ సందేశ్‌కు 14%, అలీ రెజాకు 7% ఓటింగ్ వచ్చినట్లుగా సమాచారం. అయితే లెక్కింపు పరంగా చూసుకుంటే రాహుల్ ఏకంగా 2 కోట్ల 35 లక్షల ఓట్లతో అందరి కంటే ముందున్నాడు.ఇక ముందు నుంచి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న శ్రీముఖి చివ‌ర్లో ఓటింగ్ రేసులో వెన‌క‌ప‌డిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news