నాన్నతో ప్రేమగా.. ఫాదర్స్‌డే #SelfiewithDad

-

మనలోకంతో ఫాదర్స్‌ డే నాన్నతో ఓ సెల్ఫీ అంటూ మనలోకం ఇచ్చిన పిలుపునకు వీపరీతమైన స్పందన లభించింది.
వందలాది మెయిల్స్‌ రావడం సంతోషంగా ఉన్నాచాలామంది తమతో నాన్నలేరంటూ బాధను వ్యక్తం చేశారు. నాన్న లేడు. నాన్నతో ఫోటో లేదు.. ఎక్కడో గుంపులో నాన్న నేను ఉన్నఫోటో ఉంది అది కూడా ఇద్దరం ప్రక్కపక్కన లేదంటూ మిత్రుడు పెట్టిన మెయిల్‌ మనసును తాకింది .నాన్నతో ఓ సెల్ఫీ మంచి ఆలోచనంటూ ప్రశంసలు కురిపించారు. ప్రపంచాన్ని తమ కెమెరాలో బంధించే ఫోటోగ్రాఫర్స్‌, క్రియేటర్స్‌ల దగ్గర కూడా తమ నాన్నతో ఫోటో లేదు ఇప్పటివరకు.. కావాలని కాకపోయినా నాన్నతో ఫోటోదిగరు.. పోటో దిగడం మాత్రమే ప్రేమ అని కాదు. అది తీపి గురుతుగా మిగిలిపోయే రోజు తెలుస్తుంది.. నాన్నతో ఉన్న ఫోటో విలువ..

అయితే మనకు వచ్చిన చాలా సెల్ఫీలను గమనిస్తే.. తండ్రితో కూతురు ఉన్న ఫో్టోల్లో ఇద్దరూ సంతోషంగా ప్రేమగా కనిపిస్తే, తండ్రితో కొడుకు ఉన్న ఫోటోల్లో ఇద్దరు కూడా కొంచెం గంభీరంగా కనిపించడం విశేషం. అంతేగా మరి తండ్రి కొడుకుతో అలాగే ఉంటాడు కదా.. వారిద్దరి మద్య ఉండే ప్రేమకు అనురాగానికి క్రమశిక్షణ అనేది అడ్డుగా ఉంటుంది.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news