దొంగ దీక్షలు, దిగజారుడు మాటలు..! : విజయసాయిరెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు ముగిసిపోయినప్పటికీ.. దాని వేడి మాత్రం ఇంకా అలానే కొనసాగుతుంది. అందుకే అధికార, ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఉదయం, టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రాజ్యసభ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనంటూ కళా వెంకట్రావు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తోందని మరో పచ్చనేత. క్రిమినల్స్ రాజ్యసభకు వెళ్తున్నారంటూ సభా మర్యాదకు భంగం కలిగేలా ప్రేలాపన. ఇలా దిగజారి మాట్లాడే బదులు ఆత్మ విమర్శ చేసుకోండి. మీ ఎమ్మెల్యేలే ఛీకొట్టి మీకు ఓటేయలేదని గ్రహించండి’ అని విజయసాయిరెడ్డి తన ట్విటర్ వేదికగా మందిపడ్డారు.

అలాగే అంతకముందు.. గతంలో చంద్రబాబు చేసిన దుబారా ఖర్చుపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘ఉద్యోగుల కష్టార్జితానికి చంద్రబాబు కన్నమేశారని కాగ్ తేల్చింది. 731 కోట్ల రూపాయల సీపీఎస్ డబ్బును బ్యాంకుకు జమ చేయలేదు. ఉద్యోగుల జీతాల నుంచి పది శాతం కొట్టేశాడు. ప్రత్యేక విమానాలకు, దొంగ దీక్షలకు దుబారా చేశాడు బాబు గారు’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news