Independence day Nostalgic things
స్వాతంత్య్ర దినోత్సవం గురించి చెప్పుకోవడానికే చాలా ఉంది. ముఖ్యంగా ఆనాటి రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం అంటే కొన్ని ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ తరం వాళ్లకేమో కానీ అప్పటి తరం వాళ్లకి స్వాతంత్ర దినోత్సవం అంటే వేరే. స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము. ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం వచ్చింది. భారతదేశం వందల ఏళ్ల బానిసత్వం నుంచి విడుదలైంది. దానికి గుర్తుగా స్వాతంత్రం అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవంగా, జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవంగా జరుగుతాయి. అయితే స్వాతంత్ర దినోత్సవం అంటే అప్పటి వాళ్లకి గుర్తొచ్చే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.
జెండా వందనం:
స్వాతంత్య్ర దినోత్సవం అంటే స్కూల్ కి వెళ్లి జెండా వందనం చేయడం. స్కూల్ ప్రిన్సిపల్ జెండా వందనం చేసిన తర్వాత.. జనగణమన పాడి ఇంటికి వచ్చేవారు.
స్పీచ్ ఇవ్వడం:
స్వాతంత్ర దినోత్సవం నాడు స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహనీయులని వారి యొక్క కష్టాన్ని చెప్తూ.. ఆరోజు స్పీచ్ ఇచ్చేవారు. స్వాతంత్ర దినోత్సవానికి రెండు మూడు రోజుల ముందే స్పీచ్ కి ప్రిపేర్ అయ్యేవారు. స్పీచ్ ప్రిపేర్ అవ్వడానికి ఇంటికి ఆలస్యంగా రావడం టీచర్ల దగ్గరకు వెళ్లి తప్పులను సరి చేయించుకోవడం వంటివి చేసేవారు.
పాటలు పాడడం, డాన్సులు వేయడం:
దేశభక్తి గేయాలు, పాటలు, డాన్సులు ఇవన్నీ కూడా చూడడానికి వినడానికి అద్భుతంగా ఉండేవి. స్వాతంత్ర దినోత్సవం అంటే కచ్చితంగా దేశ రంగీలా పాట కి డాన్స్ వేయాల్సిందే అన్నట్లుగా డెడికేషన్ ఉండేది. ఇలా స్వాతంత్ర దినోత్సవము అంటే అప్పట్లో ఇవి ఉండాల్సిందే. ఇవన్నీ బాల్యంలో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండే ఉంటారు. మరి వీటిల్లో మీ ఫేవరెట్ ఏది?