తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ ఆర్టీసీని ప్రైవేట్ లో విలీనం చేస్తారనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు ఆర్టీసీని ప్రైవేట్ లో విలీనం చేయడం లేదని.. ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు పలు కీలక మార్పులు, చేర్పులు చేశారు. ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచి భరోసా కల్పించారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటి ప్రభుత్వం కూడా ఆర్టీసీని బలోపేతం చేస్తామని చెబుతోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి కరీంనగర్ ఆర్టీసీ డిపో-2 వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మేజర్స్ జేబీఎం అనే సంస్థకు ఈ డిపో నుండి బస్సులు నడిపేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ డిపో నుండి నడవనున్నాయి ఎలక్ట్రిక్ బస్సులు. అయితే ఇప్పటికే ఈ డిపోకు చేరుకున్నాయి 35 ఎలక్ట్రిక్ బస్సులు.