భారత దేశం సాధించిన అతిపెద్ద ఆర్థిక విజయాలు ఇవే..

-

విదేశీ పాలకుల నుంచి విముక్తి పొందిన మన దేశంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి అభివృద్ధి పథంలో పరుగు తీస్తున్నది. అనేక అంశాల్లో భారతీయుల జీవన ప్రమాణాలు, ఆర్థిక వ్యవస్థ మెరుగైంది. స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన కొన్ని ప్రధాన విజయాలను చూద్దాం..


స్వాతంత్ర్యం పొందిన తర్వాత మన దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మౌలిక, విద్యా వైద్య రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించింది. లక్షల కిలోమీటర్ల రోడ్లు, డ్యాములు, ఇతర నిర్మాణాలు జరిగాయి. జీడీపీ కూడా గణనీయంగా పెరిగింది..ఆర్థిక లాభాలలో దూసుకుపోతుంది..
స్వతంత్ర భారత్ సాధించిన గొప్ప విజయం ఆహార ఉత్పత్తి. 1950, 60లలో కరువు కాటకాలతో అల్లాడి తిండి దొరకని పరిస్థితుల్లో విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. కానీ, నేడు భారత్ స్వయం సమృద్ధిని సాధించడమే కాదు.. నికరంగా చూస్తే ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే దేశంగా అవతరించింది..ఇది నిజంగా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి.

1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలు అమలు చేసిన తర్వాత జీడీపీ అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది.

1950 -51 సంవత్సరాల్లో మన దేశం దగ్గర విదేశీ మారక నిల్వలు కేవలం రూ. 1,29 కోట్లు ఉన్నాయి. ఈ స్వల్ప నిధులు చాలా కాలం కొనసాగింది. 1991 నాటికి ఈ నిల్వలు 1.2 బిలియన్ల డాలర్లకు చేరాయి. అప్పుడు అవి మూడు వారాల దిగుమతి సరిపోయేవి. కానీ, 1991 తర్వాత ఈ నిల్వలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు మన దేశం దగ్గర సుమారు రూ. 50 లక్షల కోట్లకు చేరువలో విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారక నిల్వలు ఉన్న దేశంలో భారత్ ఐదో స్థానంలో ఉన్నది..

1950 కాలానికి భారత్‌లో 4 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. కానీ, ఈ 75 ఏళ్లలో ఊహించని స్థాయిలో రోడ్ల నిర్మాణం జరిగింది. గతేడాది కల్లా మన దేశంలో సుమారు 64 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఈ అంశంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది..

1948లో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు రూ. 256 కోట్లు. కానీ, 1991లో లిబరలైజేషన్ తర్వాత ఎఫ్‌డీఐలు భారీగా పెరిగాయి. 2020-21లో భారత్ 81.72 బిలియన్ అమెరికన్ డాలర్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను మన దేశం ఆహ్వానించింది.

విద్యుత్ 1950లో కేవలం 3061 గ్రామాలకే పరిమితం అయింది. 2018 కల్లా విద్యుత్ మన దేశంలోని ప్రతి గ్రామానికి చేరింది. ఒక గ్రామంలో పది శాతం కుటుంబాలకు విద్యుత్ సేవలు అందితే ఆ గ్రామానికి విద్యుత్ చేరిందనే నిబంధన ప్రకారం, అన్ని గ్రామాలకు (5,97,464) విద్యుత్ చేరినట్టు 2018లో ప్రభుత్వం ప్రకటించింది.

ఈ అభివృద్ధి ఫలితాలతో మన దేశంలో జీవిత కాలం పెరిగింది. 32 ఏళ్ల నుంచి 66 ఏళ్లకు పైగా పెరిగింది. శిశు మరణాల రేటు ప్రతి వేయి మందికి 47.57కు తగ్గింది. అక్షరాస్యత శాాతం 12 శాతం నుంచి 75శాతానికి చేరింది..

Read more RELATED
Recommended to you

Latest news