వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గంలోనే ఐదు రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. నేడు కొడంగల్ నియోజకవర్గ కేంద్రం బండ ఎల్లమ్మ దేవాలయం నుండి ఈ పాదయాత్ర మొదలైంది. మొదటి రోజు పాదయాత్ర అనంతరం షర్మిల మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డిని ఓడించారని అన్నారు. కొడంగల్ లో ముఖం చల్లని రేవంత్ రెడ్డి మొహం రాష్ట్రం మొత్తం చేల్లుతుందా అంటూ ప్రశ్నించారు.
హరీష్ రావు వచ్చి బంగారు కొడంగల్ చేస్తా అని చెప్పారు..చేశారా? అని ప్రశ్నించారు. కోస్గికి బస్ డిపో అన్నారు ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు. చిన్న దొర కేటీఆర్ వచ్చి కొడంగల్ ను దత్తత తీసుకొని సిరిసిల్లలా చేస్తా అని అన్నారు. దత్తత తీసుకోలేదు కదా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. చిన్న దొర కాలికి దెబ్బ తగిలితే ఆయన మెదడు పనిచేయడం లేదంటూ ఎద్దేవా చేశారు.
అన్ని పథకాలు ఆపేసి.. 5 వేలు రైతుబంధు గొప్పగా ఇస్తున్న అని కేసిఆర్ చెబుతున్నారని.. 5 వేలు ఇస్తే రైతులు కోటీశ్వరులు అవుతారా అంటూ ప్రశ్నించారు. ఎ వర్గాన్ని ఆదుకోలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది అని అన్నారు.