Yoga day: యోగా చేయడం వల్ల వయస్సు తగ్గడమే కాదు..నిత్య యవ్వనం కూడా..

-

ఒక బరువు తగ్గాలని అనుకున్న, మానసిక ప్రశాంతత కావాలన్నా, దీర్ఘకాలిక సమస్యలు పోవాలన్నా కూడా యోగా ఒకటే మార్గం అంటున్నారు ఈనాటి యువతి.చదువుకునె పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకూ ప్రతి ఒక్కరూ యోగావైపు మొగ్గు చూపుతున్నారు..ఈ యోగా వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా నిత్య యవ్వనంగా ఉండటమే కాదు.. వయస్సు కూడా తగ్గిన భావం కలుగుతుందని యోగా నిపుణులు అంటున్నారు.. ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

 

ఇండియాలో 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. వరుసగా 8వ సారి జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 79 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ ఎందుకు పెరుగుతుందంటే..యోగాపై వెలుగుచూస్తున్న పరిశోధనలే కారణం. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్, ఢిల్లీ ఐఐటీ సంయుక్తంగా చేసిన పరిశోధనల్లోయోగాసనాల్లో ఒకటైన ప్రాణాయామంతో పెరుగుతున్న వయస్సును నియంత్రించవచ్చని తేలింది..

అతి కొద్ది సమయంలో చేసే బ్రామరీ ప్రాణాయామం అనేది మెమరీ పవర్ పెంచేందుకు, ఒత్తిడి తగ్గించేందుకు, రక్తపోటు నియంత్రణలో పనిచేస్తుందని తెలిసింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రాణాయామంతో పెరుగుతున్న వయస్సు చాలావరకూ తగ్గుతుందని నిపుణులు తెలిపారు.గుండె సంబంధిత రోగాలు కూడా ప్రాణాయామం ద్వారా తగ్గుతున్నాయని తెలిపారు..ప్రాణాయామంతో పుట్టే ధ్వని..మస్తిష్కాన్ని శాంతంగా ఉంచే పనిచేస్తుందని ఢిల్లీ ఐఐటీ తేల్చింది. ఈ ప్రక్రియ కారణంగా ఉద్భవించే ధ్వనితో చాలామంది ఈసీజీ ఫలితాలు మెరుగ్గా కన్పించాయట. అంటే గుండె సంబంధిత రోగాలు కూడా ప్రాణాయామం ద్వారా తగ్గుతున్నాయని తేలింది..

Read more RELATED
Recommended to you

Latest news