రక్షాబంధన్ స్పెషల్ : మీ తోబుట్టువులతో కలిసి ఫిట్ గా ఉండటానికి 5 మార్గాలు

-

మిమ్మల్ని అపురూపంగా చూసుకునే అన్నయ్య తమ్ముడు ఉంటే మీ లైఫ్ ఎంతో జాయ్ ఫుల్ గా ఉంటుంది. అన్నాచెల్లెల్లు అక్కాతమ్ముళ్ల బంధం అనేది ఒకరికొకరు తోడుగా నిలుస్తూ బాధ్యత గల మనుషులుగా మనం ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనకు తల్లిదండ్రులే రోల్ మోడల్స్ అయినా.. మన లైఫ్ లో మన తోబుట్టువులు కూడా రోల్ మోడల్స్ గా నిలుస్తూ మన లైఫ్ రైట్ డైరెక్షన్ లో వెళ్లడానికి హెల్ప్ చేస్తుంటారు. ఫ్యామిలీలో ఒకరికి హెల్త్ బాలేకపోతే దాని ప్రభావం ఆ ఫ్యామిలీ మొత్తం మీద పడుతుంది. ముఖ్యంగా తోబుట్టువుల్లో ఎవరికైనా చిన్న జ్వరం వస్తే మరొకరు కూడా డల్ అయిపోతారు. అందుకే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది.  ఈ రక్షా బంధన్ రోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి లైఫ్ ని జాయ్ ఫుల్ గానే కాదు హెల్దీగా కూడా ఎలా మలుచుకోవచ్చో చూడండి. మీ సిబ్లింగ్స్ తో కలిసి ఫిట్ గా ఉండటానికి మీ బంధం మరింత బలపడటానికి కలిసి ఎక్సర్ సైజ్ చేయండి.

ఈ రక్షాబంధన్ రోజున మీరు మీ అక్కాచెల్లెల్లని రక్షిస్తామనే వాగ్దానమే కాకుండా.. వారితో కలిసి ఆరోగ్యంగా ఉండటానికి.. ఫిట్ గా ఉండటానికి ఈ ఐదు రకాల ఫిట్ నెట్ టిప్స్ ట్రై చేస్తామని ప్రామిస్ చేయండి. ఇవి మిమ్మల్ని ఫిట్ గా ఉంచడమే గాక.. మీ రిలేషన్ ని ఇంకా క్లోజ్ చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం దీనిపై మీరూ ఓ లుక్కేయండి..

1. కలిసి వాకింగ్/ రన్నింగ్ కు వెళ్లండి

మీ తోబుట్టువులతో కలిసి రన్నింగ్/ వాకింగ్ కు వెళ్లడం వల్ల మీరు చాలా హుషారుగా ఉంటారు. వారంలో ఒకరోజు లేదా రోజులో ఒక అరగంట ఇలా సమయం కేటాయించుకుని కలిసి వాకింగ్ కు వెళ్తే జీవితాంతం ఈ హెల్దీ హాబిట్ మీకు అలవాటవుతుంది. ఇంకా రాత్రి భోజనం తర్వాత మీ సిబ్లింగ్స్ తో కలిసి చేసే వాకింగ్ మరింత స్పెషల్. ఆ సమయంలో మీరు మీ రోజంతా ఎలా గడిచిందో.. మీ లైఫ్ లో ఏం చేయాలనుకుంటున్నారో ఇలా కాస్త సీరియస్ టాక్ మాట్లాడుకోవచ్చు. ఇది మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది.

2. కలిసి ఇంటి పనులు చేయడం


ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేం ఉండదు అన్నట్లు కలిసి పని చేస్తే కష్టపడుతున్నామన్న ఫీలింగ్ అస్సలు ఉండదు. ఇలా కలిసి పనిచేసేటప్పుడు మీ తోబుట్టువుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు. కలిసి ఇంటి పనులు చేసేటప్పుడు.. పనులు షేర్ చేసుకోవడం ద్వారా షేరింగ్ ఈజ్ కేరింగ్ అనే విషయం అర్థమవుతుంది. ఇలా ఇంట్లో పనులు అబ్బాయిలు కూడా నేర్చుకోవడం వల్ల అవి వారు చదువు, ఉద్యోగం పేరుతో ఇంటికి దూరంగా ఉన్నప్పుడు హెల్ప్ అవుతాయి. లేదా పెళ్లి తర్వాత వారి లైఫ్ పార్టనర్ కి సాయం చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే ఇంటి పనులు మీ తోబుట్టువులతో కలిసి చేయండి. మేం అబ్బాయిలం అనే అహం లేకుండా ఈ పనులు మేం కూడా చేయగలం.. ఇవి నేర్చుకోవడం మాక్కూడా అవసరమేనని అర్థం చేసుకోండి. ఇది మీ అక్కాచెల్లెల్ల పట్ల మరికాస్త గౌరవాన్ని పెంచినట్లవుతుంది.

3. కలిసి డ్యాన్స్ క్లాసులకి వెళ్లండి

కాస్త బీట్ వినపడిందంటే చాలు.. మన కాళ్లు నేల మీద ఆగవు. మ్యూజిక్ కి సింక్ తో మన బాడీ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. డ్యాన్స్ క్లాసులకి కలిసి వెళ్లడం.. కలిసి డ్యాన్స్ చేయడం వల్ల అన్నాచెల్లెల్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య బంధం మరింత బలపడుతుంది. దాంతో పాటు మీరు హెల్దీగా ఉండేలా కూడా చేస్తుంది. డ్యాన్స్ చేస్తే ఆరోజంతా ఎంతో హుషారుగా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటే ఆరోగ్యం మీ చెంత ఉన్నట్లే. ఇలా కలిసి డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల సోషల్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ అలవాటవుతుంది.

4. కలిసి ఆరోగ్యకరమైన.. టేస్టీ మీల్స్ ఎంజాయ్ చేయండి

హ్యాపీ రిలేషన్స్ తో మన లైఫ్ జర్నీ ఎంతో హాయిగా సాఫీగా సాగుతుంది. మీరు ఫుడ్ లవర్స్ అయినా కాకపోయినా.. మన లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ చాలా వరకు టేస్టీ మీల్స్ చుట్టే తిరుగుతుంటాయనేది మాత్రం నిజం. కలిసి రెస్టారెంట్ కి వెళ్లడం.. స్కూల్ బయట కలిసి పానీపూరి తినడం.. ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ షేర్ చేసుకోవడం.. ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేయడం ఇలా మన లైఫ్ లో ముఖ్యమైన జ్ఞాపకాలన్నీ తిండి చుట్టే ఉంటాయి. మీ సిబ్లింగ్స్ తో కలిసి వంట చేయడం.. మీకు నచ్చిన వంటకాలు వారు చేస్తున్నప్పుడు మీరూ వాళ్లకి హెల్ప్ చేయడం.. లేదా వాళ్లకి నచ్చిన వంటకాలు మీరు చేసి వాళ్లని సర్ ప్రైజ్ చేయడం వంటి వాటి వల్ల తోబుట్టువుల మధ్య ప్రేమ రెట్టింపవుతుంది. కలిసి ఆరోగ్యకరమైన వంటకాలు చేయడం వల్ల రిలేషన్స్ తో పాటు హెల్త్ కూడా బాగుంటుంది.

5. కలిసి ట్రెక్కింగ్/ హైకింగ్ కి వెళ్లండి

కలిసి హైకింగ్ వెళ్లడం ద్వారా ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయొచ్చు. ఇంటి నుంచి దూరంగా.. మీ ప్రపంచానికి దగ్గరగా ఉన్నప్పుడు మీ మధ్య వచ్చే సంభాషణ చాలా విలువైనది. ఇలా మీనింగ్ ఫుల్ కన్వర్సేషన్ తో మీ మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాకుండా హైకింగ్/ ట్రెక్కింగ్ తో మీరు శారీరకంగా బలంగా తయారవుతారు. ఇది మీ గుండె, శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది కూడా. ఎప్పుడూ ఫ్రెండ్స్, కొలీగ్స్ తోనే కాకుండా ఇలా మీ సిబ్లింగ్స్ తో కూడా హైకింగ్ కి వెళ్లండి. మీ రిలేషన్ ని మరింత స్ట్రాంగ్ గా మార్చుకోండి.

ఈ రాఖీకి మీరు ఫిట్ నెస్ కి ఓకే అనండి. మీ అక్కాచెల్లెల్లతో కలిసి భోజనం తయారు చేయండి. ఇంటిల్లిపాది కలిసి భోజనం చేయండి. ఫాస్ట్ ఫుడ్ కి నో చెప్పండి.. సిబ్లింగ్స్ తో కలిసి వాకింగ్ కి వెళ్లండి.. మీకు మీ ఫ్యామిలీకి మనలోకం తరఫున… హ్యాపీ రక్షాబంధన్

Read more RELATED
Recommended to you

Latest news