Raksha Bandhan 2024: తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం 19 ఆగస్టు 2024 సోమవారం రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోబోతున్నారు. ఈ పవిత్రమైన రోజున సోదరసోదరీమణులు మధ్య ప్రేమానురాగాలకు ప్రత్యేకగా రక్షాబంధన్ జరుపుకుంటారు. శాస్త్రం ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టాలని జ్యోతిష్య పండితులు అంటున్నారు. రాఖీ పౌర్ణమి వేళ మూడు ప్రత్యేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. సర్వార్ధి సిద్ధి యోగం, శోభన్ యోగం, రవి యోగం.
రాఖీ కట్టడానికి శుభ సమయం ఇదే:
ఇక రాఖీ కట్టడానికి శుభ సమయం ఏది అనేది చూద్దాం.. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది. రాఖీ కట్టడానికి సోమవారం మధ్యాహ్నం 1:00 నుంచి రాత్రి 9:08 గంటల వరకు శుభ సమయం అని పండితులు అంటున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3:39 వరకు మరింత ప్రత్యేకంగా ఉందని పండితులు చెప్పడం జరిగింది.
రాఖీ పౌర్ణమి నాడు మూడు ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. పురాణాల ప్రకారం సూర్య దేవుని కూతురు భద్ర రాక్షసుల్ని నాశనం చేయడానికి పుట్టింది. తమ పుట్టినరోజు సమయంలో విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవడం జరిగింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా కూడా ఇబ్బందులు వస్తాయి. అలానే చంద్రుడు కర్కాటకం, సింహ, కుంభ, మీన రాశల్లో ఉంటుంది. అందుకని ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతం అవ్వవు.