మూడు రోజుల పాటు ఆ స్పెషల్‌ రైళ్లు రద్దు..!

-

గత కొంత కాలం నుంచి రైల్వే శాఖకు సంబంధించి కొన్ని వార్తలు వింటుంటే భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రైల్వే ప్రమాదాలు.. రైళ్ల రద్దు వంటి వార్తలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ట్రాక్ మరమ్మతులు, రైల్వే స్టేషన్ల నిర్మాణాల వంటి కారణంగా ఆయా ప్రాంతాల నుంచి వెళ్లే రైళ్లను దారి మళ్లించడంతో పాటు కొన్ని రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ఎప్పటికప్పుడూ అప్ డేట్ లను అందిస్తుంది.

ఈ నేపథ్యంలోనే పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ ఓ కీలక అప్ డేట్ విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే శాఖ మూడు రోజుల పాటు పలు మార్గాలలో నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. నేటి నుంచి అనగా ఆగస్టు 17 నుంచి తిరుపతి-కాచిగూడ, కాకినాడటౌన్-సికింద్రాబాద్, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నర్సాపూర్ వెళ్లే రైల్లు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ తాజాగా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news