ప్రైవేటు నుంచి సర్కారు బడికి.. విద్యారంగంలోనూ వలసలు వాపస్

-

తెలంగాణలో అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ విద్యాదినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్య గురించి.. రాష్ట్రంలో విద్యారంగం కోసం తీసుకున్న నిర్ణయాల గురించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. “విద్యతోనే వికాసం, విద్యతోనే ఆత్మవిశ్వాసం… ప్రతి తరగతి గది, తరగని విజ్ఞాన గని” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ నాలుగు గోడలే దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలని వ్యాఖ్యానించారు.

తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానంలో సరికొత్త విద్యా విప్లవంతో తెలంగాణ యావత్ దేశానికే పాఠాలు నేర్పుతోందని ఉద్ఘాటించారు. కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల వైపు లక్షకు పైగా కొత్త విద్యార్థులు అడుగులు వేశారని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో డ్రాప్-అవుట్ లు ఉంటే… తెలంగాణలో మాత్రం డ్రాప్-ఇన్ లు… ఉన్నాయని మంత్రి కేటీఆర్ రాసుకొచ్చారు. అలాగే ప్రైవేటు పాఠశాల నుంచి విద్యార్థులంతా సర్కారు బడి బాట పడుతున్నారని.. వ్యవసాయరంగంలోనే కాకుండా.. విద్యారంగంలోనూ వలసలు వాపసు వస్తున్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news