తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. హస్తం ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈరోజుతో మొదలవనున్న ఈ ఉత్సవాలు 20 రోజుల పాటు నిర్వహించనున్నారు. రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పాత్రను స్పష్టంగా చెప్పేందుకు ఆ పార్టీ నేతలు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేదికగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. బిల్లు ఆమోదం పొందిన సమయంలో అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే గాంధీ భవన్‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.
ఉదయం 11 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపంవద్ద… మీరాకుమార్ నివాళులఅర్పిస్తారు. అనంతరం నిజాంకాలేజ్ వద్ద బాబూజగ్జీవన్‌రాం విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.అక్కడ నుంచి పాదయాత్ర గన్‌ఫౌండ్రి, అబిడ్స్ నెహ్రూ విగ్రహం, మొహంజాహి మార్కెట్ మీదుగా గాంధీభవన్‌కు చేరుకుంటుంది. అనంతరం గాంధీభవన్‌లో జరిగేతెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభలో ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ముఖ్యులను సన్మానించనున్నారు. తెలంగాణ యువత, విద్యార్థుల త్యాగాల ఫలితం వల్లే రాష్ట్రం ఏర్పాటైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.