కేంద్ర బడ్జెట్ 2023-24లో మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. స్త్రీ సంక్షేమానికి పెద్దపీట వేసింది. స్త్రీల కోసం ప్రత్యేక కేటాయింపులు చేయడమే కాకుండా మరో ప్రత్యేక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. అదేంటంటే.. ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం.
మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది.
అలాగే.. సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద ప్రస్తుతం గరిష్ఠ పరిమితి రూ.15 లక్షల వరకు మాత్రమే ఉంది. దీన్ని రూ.30 లక్షలకు వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.