పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ధరించిన జాకెట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన వస్త్రధారణకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో తెలిసిందే. కార్యక్రమానికి తగ్గట్టుగా మోదీ వస్త్రధారణ ఉంటుంది. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ రాజ్యసభకు వచ్చారు మోదీ. ఈ సభలో మోదీ లైట్ బ్లూ కలర్ జాకెట్ ధరించి ఉన్నారు. అయితే ఎప్పుడూ కనిపించే వస్త్రధారణలోనే వచ్చినా.. ఇవాళ మోదీ ధరించిన జాకెట్ కు ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే..?

ఇవాళ రాజ్యసభకు మోదీ ధరించిన జాకెట్ ను ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైకిల్‌ చేసి  తయారు చేశారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ‘ఇండియా ఎనర్జీ వీక్‌ 2023’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ సోమవారం పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్.. ప్రధానికి అరుదైన కానుకను అందజేసింది.

పెట్ ‌(పాలీఇథలిన్‌ టెరెఫ్తలేట్‌) బాటిళ్లను రీసైకిల్‌ చేసి తయారు చేసిన నీలం రంగు జాకెట్‌ను మోదీకి గిఫ్ట్​గా ఇచ్చింది. ఆ జాకెట్‌నే ప్రధాని ధరించి బుధవారం పార్లమెంట్‌కు వచ్చారు. ‘బ్లూ జాకెట్‌’తో హరిత సందేశమిచ్చారు. ‘హరిత వృద్ధి’ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మోదీ సర్కారు.. ఇటీవలే రూ.19,700 కోట్లతో నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ను ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Latest news