బ్యాడ్ మూడ్ నుండి బయట పడాలంటే ఇలా చెయ్యండి..!

-

కొన్ని కొన్ని సార్లు మన మూడ్ చాలా డల్ గా ఉంటుంది. ఎంతో చిరాకుగా, చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఇటువంటి సమయంలో మంచిగా మారాలంటే ఈ టిప్స్ మీకు సహాయ పడతాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం కూడా తెలుసుకుందాం. బ్యాడ్ మూడ్ నుంచి బయట పడాలంటే ఈ విధంగా అనుసరించండి. మీరు కనుక ఇది పాటించారంటే ఆనందంగా ఉండడానికి సాధ్యమవుతుంది. మరి ఇక వాటి కోసం తెలుసుకుందాం..

పాటలని వినడం:

మీరు పాటలను వింటే ఎంత బ్యాడ్ మూడ్ అయినా కూడా ఇట్టే పోతుంది. మ్యూజిక్ ఎండార్ఫిన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని కారణంగా మంచిగా హ్యాపీగా ఉండటానికి సాధ్యపడుతుంది.

నవ్వడం:

నవ్వడం నిజంగా ఒక మంచి వ్యాయామం. నవ్వడం వల్ల ఆనందంగా ఉండడానికి వీలు అవుతుంది కాబట్టి బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువగా నవ్వుతూ ఉండండి.

మీకు నచ్చిన వ్యక్తితో సమయం గడపండి:

సాధారణంగా కోపంగా, చిరాకుగా ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. కానీ మీరు కనుక మీ మూడ్ మార్చుకోవాలంటే మీకు నచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి కాసేపు సమయం గడపండి. దీనితో మీ బ్యాడ్ మూడ్ చిటికె లో మాయం అయిపోతుంది.

శ్వాస తీసుకోవడం:

మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉండండి. ఇది బాడీ లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. దీని కారణంగా సరిపడినంత ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనితో మీరు మంచిగా ఉండడానికి వీలవుతుంది.

మీ ఆలోచనల్ని మార్చుకోండి:

మీరు చేసే పని నుండి మీరు కొత్త పని చేయండి. ఏదైనా మంచి రెసిపీ చేయడం లాంటివి మీరు చేయొచ్చు. దీనితో మీ మూడ్ మారిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news