కరోనా మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తోంది అనే సరికి బ్లాక్ ఫంగస్ కూడా పెద్ద సమస్య అయిపోయింది. అయితే ఇప్పటికే చాల మంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. మహారాష్ట్ర బేస్డ్ జెనిటిక్ లైఫ్ సైన్సెస్ గురువారం నాడు Amphotericin B ఇంజక్షన్స్ బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కి ఉపయోగించ వచ్చని దీనిని తయారు చేయడం జరిగింది.
కరోనా వచ్చిన వాళ్లలో బ్లాక్ ఫంగస్ వస్తున్నట్లు మనందరికీ తెలిసినదే. యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ కి సంబంధించి మెడిసిన్ ని ఒకే ఒక కంపెనీ తయారు చేసిందని…
అయితే దాని ధర ఏడు వేల రూపాయలు ఉందని ఏది ఏమైనా 1200 రూపాయలకి అది అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రధానమంత్రి ఈ డ్రగ్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉందని అన్నారు. డయాబెటిస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వచ్చే అవకాశం వుంది.
అదే విధంగా ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండే వాళ్లలో కూడా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాణాంతకమైన వ్యాధి నుండి బయట పడడం కష్టమే. ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు చూస్తే.. పంటి నొప్పి, బ్లర్ గా కనిపించడం, చెస్ట్ పెయిన్, ముక్కు మరియు మొఖం మీద కొన్ని చోట్ల నొప్పి కలగడం లాంటి లక్షణాలు ఉన్నాయి. ఎక్కువ రిస్కు డయాబెటిస్ వాళ్లకి, స్టెరాయిడ్స్ ఉపయోగించే ఎక్కువగా ఉపయోగిస్తే వస్తుంది. ఏది ఏమైనా వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది.