అమ్మాయిలు మీ నుంచి ఏం కోరుకుంటారో తెలుసా బాయ్స్‌..!!

-

ఈ సృష్టిలో ప్రతి వ్యక్తికి ఎదుటి వారితో ఏదో ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరమై వారిని ఒకటి చేస్తుంది. ఏం ఆశించకుండా ఎవరూ మీతో ఉండరు. అది ప్రేమ, డబ్బు, టైమ్‌పాస్‌, ఇతర అవసరాలు ఏదో ఒకటి ఉంటుంది. మీతో ఎలాంటి పని లేదు అంటే.. ఆటోమెటిక్‌గా మీ నుంచి మనుషులు దూరం అవుతారు. మీలో ఉన్న ఏదో ఒక క్వాలిటీ వారిని ఆకర్షిస్తేనే జనాలు దగ్గరవుతారు. ఇక అమ్మాయి, అబ్బాయిల విషయానికి వస్తే.. అమ్మాయిలు పర్టిక్యులర్‌గా అబ్బాయిల నుంచి కొన్ని కోరుకుంటారు.. మీరు అనుకునేది కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. ప్రేమిస్తున్నాను అని మీరు చెప్తే సరిపోదు. వారి కోరికలను తీర్చాలి. కోరికలు అంటే.. అమ్మాయిలను షాపింగ్‌తీసుకెళ్లడం అనుకుంటారేమో అది కూడా కాదు.. ఇంతకీ అమ్మాయిలుకు అబ్బాయిల నుంచి ఏం కోరుకుంటారు..?

మహిళలు తమ భాగస్వాముల నుండి ఎమోషనల్ సపోర్ట్, తనవాడికి తన గురించి అన్నీ తెలిసి ఉండాలి అనుకుంటారు. అన్నీ చెప్తేనే కాదు.. కొన్నిసార్లు చెప్పకుండానే మన పరిస్థితులను అర్థంచేసుకోవాలి. స్త్రీ చెప్పేది వినడం, సానుభూతి చూపడం, భావోద్వేగ మద్దతు అందించాలని కోరుకుంటారు.

గౌరవం అనేది బంధంలో చాలా ముఖ్యం. గౌరవం అంటే.. ఏం అండీ, భార్యగారు, భర్తగారు అని పిలుచుకోవడం కాదు. వారి ఇష్టాలను గౌరవించాలి, వారి అభిప్రాయాలకు వాల్యూ ఇవ్వాలి. ఇది ఇద్దరు పాటించాలి.

స్త్రీ పురుషుల మధ్య క్లియర్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కీలకం. స్త్రీలు తమ ఆలోచనలు, భావాలను బహిరంగంగా వ్యక్తీకరించే పురుషులనే ఇష్టపడతారు. అన్నీ మీలోనే దాచుకుంటూ.. అడ్జస్ట్‌ అయితే వాళ్లకు నచ్చదు. ఓపెన్‌గా చెప్పే వాళ్లంటేనే స్త్రీలకు నచ్చుతుంది. భావోద్వేగాలను, ఆందోళనలను పంచుకోవడానికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించే మగాళ్ల అంటే మహిళలకు ఇష్టం.

నమ్మకం.. ఇది చాలా కీ రోల్‌ ప్లే చేస్తుంది. మీ రిలేషన్‌షిప్‌లో నమ్మకం అనే పునాది లేకపోతే.. అది ఎన్నేళ్లబంధం అయినా తెగిపోతుంది. స్త్రీలు తమ చర్యలు, మాటలలో విధేయత, నిజాయితీ, పారదర్శకంగా ఉండే పురుషులను కోరుకుంటారు. నమ్మకాన్ని పెంపొందించడానికి సమయంతో పాటు కృషి కూడా అవసరం.

కలిసి జీవితాన్ని నిర్మించుకోవడంలో చురుకుగా పాల్గొనే భాగస్వాములను మహిళలు కోరుకుంటారు. ఒకరికొకరు కలలు, ఆశయాలు, బాధ్యతలకు మద్దతు ఇవ్వాలి. ఒకరి కలకు ఒకరు సహకారం ఇవ్వాలి. కలిసి సవాళ్లను అధిగమించడంలో ముందుకు వచ్చే.. పురుషుడిని మహిళలు ఇష్టపడతారు.

శృంగారం, ఆప్యాయత సంబంధంలో స్పార్క్‌ను సజీవంగా ఉంచుతాయి. కావాల్సిన వ్యక్తికి సంబంధించిన తేదీలు, అభినందనలు, బర్త్ డే రోజున, పెళ్లి రోజున ఒక్క హగ్ లాంటివి మహిళలు కోరుకుంటారు. ఇలాంటివి మహిళలకు చాలా హ్యాపీ ఫీల్‌ అవుతారు. లాంగ్‌ డిస్టెన్స్‌ రిలేషన్‌షిప్‌లో కలిసిస వెంటనే ఒక హగ్‌ ఆ ఎడబాటును మొత్తం తీరుస్తుంది.

కలిసి ఉండటం ముఖ్యమే అయితే మహిళలు తమ స్వేచ్ఛ, వ్యక్తిగత విషయాలకు కూడా విలువ ఇస్తారు. వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచులను కొనసాగించడానికి ఒకరినొకరు అంగీకరించాలి. ఏహే నువ్ ఇదేం చేస్తావ్ లే అని మహిళలను అంటే వారికి చిరాకు వస్తుంది. మీ బంధం బలంగా ఉండాలంటే.. మహిళల ఆసక్తిని గమనించి.. వారిని ప్రోత్సహించాలి.

ఇంటి పనులు, బాధ్యతలను పంచుకోవడం గౌరవం, సమానత్వానికి సంకేతం. రోజువారీ పనులకు చురుకుగా సహకరించే పురుషులను మహిళలు అభినందిస్తున్నారు. మావాడికి నేనంటే ఎంతో ఇష్టమని మురిసిపోతారు. అందుకే సిగ్గుపడకుండా స్త్రీలు చేసే ఇంటి పనుల్లో మగాళ్లు సాయం చేయాలి.

ఓ బంధంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ముఖ్యం. మంచి కామెడీ టైమింగ్.. ఎలాంటి పరిస్థితినైనా కూల్ చేస్తుంది. కలిసి నవ్వితే.. జంటల మధ్య బంధం బలపడుతుంది. సంబంధాన్ని మరింత ఆనందదాయకంగా మారుస్తుంది. మహిళలు తమను నవ్వించగల భాగస్వామిని కోరుకుంటారు.

వ్యక్తిగత ఎదుగుదల కోసం ప్రయత్నించే పురుషులను మహిళలు కావాలి అనుకుంటారు. నేర్చుకోవడానికి, ఎదగడానికి, మంచి వ్యక్తులుగా ఉండే మగాళ్లు అంటే స్త్రీలకు ఇష్టం. తమకు తాము లాభపడటమే కాకుండా బంధానికి ఉపయోగపడే విధంగా ఎదిగేవారిని మహిళలు ఇష్టపడతారు.

స్త్రీల వ్యక్తిత్వం, మెంటాలిటీ వేరుగా ఉండొచ్చు కానీ.. దాదాపు ప్రతి అమ్మాయి పైన చెప్పిన వాటినే కోరుకుంటుంది. ఈ విషయాలను అర్థం చేసుకున్న మగాడికి టెన్షన్‌ లేకుండా రిలేషన్‌ షిప్‌ సాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news