ప్రజలకు మరింత మెరుగైన సేవలను త్వరితగతిన అందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 జీహెచ్ఎంసీ వార్డ్ ఆఫీసులను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గతంలో వేరు వేరు ప్రాంతాలలో ఉన్న వివిధ శాఖల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, వార్డ్ ఆఫీసుల ఏర్పాటు తో జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు వార్డ్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారని అన్నారు.
ఇది ఇలా ఉంటె మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆశా వర్కర్ల జీతాలు పెంచాలంటూ మంగళవారం మంత్రి తలసానికి మెమోరాండం ఇచ్చేందుకు ఆశా వర్కర్లు ఆయన నివాసానికి వెళ్లారు. కానీ మంత్రి అందుబాటులో లేరని అక్కడి సెక్యూరిటీ చెప్పడంతో వారు వినకుండా తలసాని నివాసం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు తరలిరావడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.