ప్రతీ ఒక్కరు కన్నీళ్లు పెట్టే సన్నివేశం అది…!

చాలా మందికి చిన్న నాటి జ్ఞాపకాలు ఉంటాయి కదా…? ఎవరు ఏ స్థాన౦లో ఉన్నా… వాళ్లకు ఎంత డబ్బున్నా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే చిన్న నాటి జ్ఞాపకాలు ఉంటాయి అనేది చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా స్కూల్ జ్ఞాపకాలు. కనీస చదువు చదివి, స్కూల్ కి వెళ్ళిన అందరికి కూడా ఆ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ప్రపంచంలో ఏ ఒక్క మనిషి కూడా దానికి అతీతం కాదు. స్కూల్ అనేది ఒక జ్ఞాపకం.

స్కూల్ అనేది ఒక వరం. ఆ ప్రపంచమే వేరు. ఆడుకునే ఆటలు, చేసే అల్లరి అంతా ఇంతా కాదు. చదువు ఎలా ఉన్నా సరే స్కూల్ అనేది ఎప్పుడూ అందంగానే ఉంటుంది. చదువుకున్నప్పుడు దాని విలువ చాలా మందికి తెలియదు గాని చదువు అయిపోయిన తర్వాత కాలేజి లైఫ్ కి వెళ్ళినప్పుడు మాత్రం స్కూల్ విలువ అనేది అందరికి స్పష్టంగా తెలుస్తుంది. అందుకే స్కూల్ అందంగా ఉంటుంది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి.

ఎంత పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి అయినా సరే స్కూల్ చూడగానే భావోద్వేగానికి గురవుతూ ఉంటారు కదా…? ఏ స్థానంలో ఉన్నా సరే వాళ్లకు స్కూల్ అనేది ఒక అందమైన జ్ఞాపకం. ఒక్క కన్నీటి బొట్టు అయినా సరే కారుతుంది. మన మనసు తెలియకుండా చిన్న నాటి విషయాలను గుర్తు చేస్తుంది. ఆ స్కూల్ ని ఆగి కాసేపు అలాగే చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు అడుగులు నేర్పింది అమ్మా నాన్నా అయినా సరే స్కూల్ మనకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. అందుకే స్కూల్ చూడగానే ప్రతీ ఒక్కరు చిన్న పిల్లలు అయిపోతారు.