బంధాలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది ఎవ్వరూ చెప్పలేరు. చాలా బాగున్నవాళ్ళు కూడా ఒకానొక టైమ్ లో తమ బంధాన్ని వదిలించుకోవచ్చు. మీ భాగస్వామితో మానసికంగా కనెక్షన్ తగ్గిపోవచ్చు. మీ బంధంలో ఏదో కొరవడిందని మీకు అర్థం అవుతూ ఉంటుంది. ఐతే అది తెలపడానికి కొన్ని సంకేతాలు పనికొ వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు.
మీ భాగస్వామి పక్కన ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతారు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు,, ఆనందం తక్కువై, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు.
సడెన్ బ్రేకప్
సడెన్ గా బ్రేకప్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకో అవతలి వారి మీద ప్రేమ అవసరం లేదనిపిస్తుంది.
అర్హత
నాకు నీకన్నా గొప్ప వాళ్ళు దొరుకుతారని అవతలి వాళ్ళు ఫీలయ్యారని మీకు తెలిసినపుడు అలాంటి బంధాలు ఎక్కువ రోజులు కొనసాగవు. ఆ ఫీలింగ్ ఎవరికి ఉన్నా ప్రమాదమే. మీలో ఆ ఫీలింగ్ వచ్చిందంటే మీ పార్టనర్ తో తెగదెంపులకు రెడీ అయిపోయారన్నమాటే.
అంతా అయిపోయినట్టుగా ఫీలవడం
మీ భాగస్వామిని బాగా లవ్ చేసినా కూడా అవతలి వారితో టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు అలసటగా ఫీలవడం, టైమ్ వేస్ట్ చేసానే అని అనుకోవడం మీకు అనిపించిందంటే వారితో మీ రిలేషన్ ఎక్కువ రోజులు సాగదు.
ఆలోచనలు ఒక్కటి కాకపోవడం
అంటే, మీ భాగస్వామి ఇష్టాలు కానీ, అయిష్టాలు కానీ తెలియకపోవడం. ఇలాంటి బంధాలు తొందర్లోనే అంతమైపోతాయి. అవతలి గురించి ఇంచు కూడా ఆలోచించని వారు బంధాల్లో ఉండలేరు.