ఉద్యోగంలో జీతమే ముఖ్యం అని నమ్మేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు..

-

మీరే పని చేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా ఉద్యోగానికి సంబంధించినంత వరకూ అన్ని చోట్ల ఒకేలాంటి పరిస్థితులు ఉంటాయి. కంపెనీల మనస్తత్వాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. మీరెక్కువ పనిచేస్తేనే ఎక్కువ జీతం వస్తుందని, పనిచేయకపోతే రావాల్సిన దాన్లోంచి కట్ చేసుకుంటుందని గుర్తుంచుకోండి. ఉద్యోగ జీవితం గడుపుతున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇక్కడ చూద్దాం.

మీ సహోద్యోగులు పైకి ఎదుగుతున్నారని వారికి అడ్డుపడాలని ప్రయత్నించకండి. మీకు అడ్డుగా గోడలు నిర్మించేవాళ్ళు సిద్ధంగా ఉంటారు.

పుకార్లు మోసే సహోద్యుగులతో స్నేహం మానుకోండి. ఇతరుల గురించి మీ దగ్గర చెప్పినవాడు మీ గురించి ఇతరుల వద్ద చెప్తాడు.

మీకు ఉద్యోగం నచ్చకపోతే మానేయండి. అంతేగానీ అందులో మీకు ఇబ్బంది పెట్టేవాళ్ళ మీద పగతో అదే ఆఫీసులో పనిచేస్తూ మీ ఆరోగ్యం పాడుచేసుకోండి.

మీరు ఎక్స్పర్ట్ అయిన రంగంలో మీ సహోద్యోగి కూడా ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం లేదు. వారికి మరో రంగంలో అద్భుతమైన టాలెంట్ ఉండి ఉండవచ్చు.

మీ పని కాకుండా మరో పనేదైనా మీకప్పగించినట్లయితే ఎందుకని అడగండి. అది మీ హక్కు.

నేను చేయాల్సిన కంపెనీ మరేదో ఉంది, నాక్కావాల్సింది ఇది కాదు, అని మీకనిపించినపుడు వెంటనే జాబ్ మానేయండి. ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు ఎక్కువ రోజులు ఒకే కంపెనీలో పనిచేయలేరు. మీకోసం మరేదో బెటర్ కంపెనీ వెయిట్ చేస్తూ ఉండవచ్చు.

ఉద్యోగిగా నీ హక్కులు ఖచ్చితంగా తెలిసి ఉండాలి.

నీకున్న నైపుణ్యాలతో నువ్వు పనిచేస్తున్నావు. దానికి కంపెనీ నీకు జీతం ఇస్తుంది. ఇక్కడ ఇచ్చి పుచ్చుకోవడమే అన్నమాట. మీకెవరూ ఫేవర్ చేయట్లేదని తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news