10 రోజుల్లో 3010 ఐసీయూ పడకలు

-

10 రోజుల్లో 3010 ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల వైద్య అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ తో మంత్రి ఈటల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య సిబ్బంది కంటి మీద కునుకు లేకుండా పని చేయడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. అలానే చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా చూడాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల బంధువులకు సమాచారం అందించడానికి వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అలానే పేషంట్లను ప్రతి రెండు గంటలకు ఒకసారి పర్యవేక్షించాలని అన్నారు. ఆక్సిజన్ కనీసం 24 గంటల ముందస్తుగా ఉండేలా చూడాలని అన్నారు. ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్స్ కోసం ఎక్కువ డిమాండ్ వస్తుంన్న మంత్రి… ఎంత మంది పేషంట్లు వచ్చిన చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రుల్లో ఉన్న పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని ఉదయం, సాయంత్రం పరిశీలించి… కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేయాలని సూచించారు. ప్రతి రోజు పేషంట్ ఆరోగ్య పరిస్థితిని వారి బంధువులకు ఫోన్ ద్వారా అందించాలన్నారు.

ఇక అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమిడీసివిర్ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని… పేషంట్లకు ఇచ్చిన ప్రతి ఇంజక్షన్ ఖాళీ సీసాను తిరిగి స్టోర్ లో సబ్మిట్ చేస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) తెలిపారు. ఇక ఆక్సిజన్ నిలువల సమాచారం అందించేందుకు ప్రతి ఆసుపత్రిలో ఒక నోడల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ తెలియజేశారు. ప్రతి ఆసుపత్రిలో జనరేటర్లు పూర్తి స్థాయిలో పని చేసేలా సిద్దం చేసి ఉన్నాయన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్ చేస్తూ వైరస్ ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఆపగలుగుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news