చైనాలో ద‌డ‌పుట్టిస్తున్న కొత్త వేరియంట్‌..

ఇప్పుటికే క‌రోనా ఎన్నో ర‌కాలుగా త‌న తీవ్ర‌త‌ను చూపిస్తోంది. ఓ ర‌కానికి మందు కునుగొనేలోపే మ‌రో కొత్త వేరియంట్‌తో ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టికే ఇండియా, బ్రిట‌న్‌, సౌత్ ఆఫ్రికా వేరియంట్లు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్నాయి. ఇది స‌రిపోద‌న్న‌ట్టు ఇప్పుడు చైనాలో మ‌రో కొత్త‌ర‌కం వేరియంట్ వ‌ణికిస్తోంది. దీంతో ఇప్పుడు అక్క‌డ లాక్‌డౌన్ పెట్టారు.

చైనాలోని గాంజావ్‌ సిటీలో కొత్త రకం స్ట్రెయిన్ ను గుర్తించారు అక్క‌డి అధికారులు. మునుపటి స్ట్రెయిన్‌లతో పోల్చితే ఈ స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమని తేలడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్‌ సిటీలో వారం రోజుల్లో 20 మందిలో ఈ కేసులు బయటపడ్డాయి.

దీంతో అప్రమత్తమైన చైనా అధికారులు గాంజావ్‌ ప్రాంతంలో కఠిన లాక్‌డైన్ ఆంక్షలు పెట్టారు. తదుపరి ఆదేశాలు వ‌చ్చే వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని