ప్రతి ఇళ్లలో పూజగది ఉంటుంది. ఇళ్లు నిర్మించుకునేటప్పుడు కూడా పూజకు ప్రత్యేక గది నిర్మించుకుంటారు. అయితే, వాస్తుశాస్త్రం ప్రకారం పూజగది నిర్మించేటపుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదంట. దేవుళ్ల విగ్రహాల ఏర్పాటుకు నిర్మించే ఈ గదిని సరైన దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే లేని పోని చిక్కులు వస్తాయి. అలాకాకుండా ఇష్టానుసారంగా నిర్మించి కష్టాలో తెచ్చుకోవద్దని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
పూజగదిలో కూడా సరైన దిశలో కూర్చోవాలి. అందుకే ఇళ్లు నిర్మాణం చేపట్టినప్పుడే తూర్పు వైపు తిరిగి మనం పూజ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తర ం దిశగా పూజగదిని ఏర్పాటు చేసుకోవడం అనుకూలం. చాలా మంది పూజగదిని ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మించుకుంటారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది ఎత్తు, దేవుడి పాదాలు, మన హృదయం ఒకే ప్రాంతంలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మీ ఇళ్లు పెద్దగా ఉంటే పూజ గదిని ప్రత్యేకంగా కట్టుకోవాలి. ఒకవేళ మీ ఇంటి స్థలం తక్కువ ఉన్నా, సరైన దిశను ఎంచుకొని నిర్మించుకోవడం మేలు. పూజగది పెయింటింగ్ కలర్ కూడా ఒక నియమం ఉంటది. పూజగదిలో డార్క్ కలర్ రంగులు వేయకూడదు. పసుపు, ఆకుపచ్చ, లైట్ పింక్ రంగులు వేసుకోవాలి. అలాగే, పూజగదిలో ఒకే రంగును వాడాలి. రెండూ, మూడూ కలర్‌లు వాడకూడదు. అలాగే, కొంతమంది పూజగదిలోనే చనిపోయిన వారి పూర్వీకుల ఫోటోలను కూడా పెట్టి పూజిస్తారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం అస్సలు చేయకూడదు. పూజగదిలో చనిపోయిన వారి ఫోటోలను పెట్టకూడదు. ఈ ఫోటోలకు ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా చెక్కతో చేసిన దేవుని గది కూడా మంచిదే. ఒకవేళ మీకు స్థలం ఉంటే మార్బుల్‌తో కూడా నిర్మించుకోవచ్చు. మార్బుల్‌తో నిర్మించిన పూజగది కూడా శుభాలను కలుగజేస్తుంది.