చైనాలో అన్ని రిటెయిల్‌ స్టోర్లను మళ్లీ ఓపెన్‌ చేసిన ఆపిల్‌..!

-

సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆపిల్‌ చైనాలో ఉన్న తన అన్ని రిటెయిల్‌ స్టోర్లను మళ్లీ ఓపెన్‌ చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో గతంలో ఆ స్టోర్లను ఆపిల్‌ మూసివేయగా, ప్రస్తుతం ఆ వైరస్‌ ప్రభావం నెమ్మదిగా తగ్గుతుండడంతో స్టోర్లను మళ్లీ ఓపెన్‌ చేయాలని ఆపిల్‌ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం చైనాలో ఉన్న 42 ఆపిల్‌ రిటెయిల్‌ స్టోర్లు మళ్లీ తెరుచుకున్నాయి.

apple reopens its all retails stores in china

కాగా రిటెయిల్‌ స్టోర్లను మూసివేయడంతో ఆపిల్‌ భారీ నష్టాలను చవిచూసింది. చైనాలో ఐఫోన్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఫిబ్రవరి 1వ తేదీన స్టోర్లను మూసివేయగా 9వ తేదీన స్టోర్లను తెరవాలని ఆపిల్‌ భావించింది. కానీ వైరస్‌ ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడంతో ఆపిల్‌ ఆ స్టోర్లను మూసివేసి ఉంచింది. అయితే ప్రస్తుతం చైనాలో కరోనా బారిన పడి రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో మళ్లీ తన స్టోర్లను ఆపిల్‌ ఓపెన్‌ చేసింది.

ఇక అమెరికాలో ఇప్పటికే ఇటీవల విడుదలైన ఐఫోన్‌ 11 సిరీస్‌ ఫోన్లు దాదాపుగా స్టాక్‌ అయిపోగా, ప్రస్తుతం చైనాలో అతి తక్కువ సంఖ్యలో ఆ ఫోన్ల ఉత్పత్తి కొనసాగుతోంది. అయితే ముందు ముందు పరిస్థితి కొంత వరకు మెరుగు పడవచ్చని తెలుస్తోంది. ఇక ఈ నెల చివరి వరకు ఆపిల్‌ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ 9 (ఐఫోన్‌ ఎస్‌ఈ2)ను విడుదల చేస్తుందని గతంలో తెలిసినా.. కరోనా వైరస్‌ కారణంగా ఆ ఫోన్‌ విడుదలను జూన్‌కు వాయిదా వేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news