కరోనా వ్యాక్సిన్ కోసం పోస్టాఫీస్ లో ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు..!

కరోనా మహమ్మారి నిజంగా అందరి ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయితే ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి వాళ్ళ పేరు రిజిస్టర్ చేయించుకోవచ్చు.

తాజాగా పోస్ట్ ఆఫీస్ ఈ సర్వీసులు తీసుకొచ్చింది. చాలా మందికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ లో సమస్యలు వస్తున్నాయని పోస్టాఫీసు ఈ నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం రాని వాళ్ళు, పల్లెటూళ్లలో ఉండే వాళ్ళు దీని వల్ల బెనిఫిట్స్ పొందొచ్చు.

ఆధార్ కార్డు మరియు ఫోన్ తీసుకుని పోస్ట్ ఆఫీస్ కి వెళ్తే వాళ్లు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకో వచ్చు. అయితే ఓటిపి వాళ్ల ఫోన్ కి వస్తుంది కాబట్టి ఫోన్ ని తప్పకుండా తీసుకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది.

ఇప్పటికే 36 హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఈ సర్వీస్ లాంచ్ అయ్యింది. అదే విధంగా 643 సబ్ పోస్ట్ ఆఫీస్ మరియు 10 బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో విడుదల అయింది. త్వరలో మరికొన్ని ఎనిమిది వందల బ్రాంచ్లలో ఈ సర్వీస్ వస్తుందని పోస్టల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి అన్నారు.

దీని కోసం ఎటువంటి చార్జీలు చెల్లించక్కర్లేదు. పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అప్లికేషన్ ఉపయోగించి రిజిస్టర్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి ఇంకా వ్యాక్సిన్ వేయించుకొని వాళ్లు ఈ విధంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.