ఏపీలో అత్యల్ప స్థాయికి పడిపోయిన కరోనా కేసులు, మరణాలు..!

ఏపీలో కరోనా కేసులు గత కొద్దీ రోజుల నుండి తగ్గు ముఖం పట్టాయి. ఈ మహమ్మారి కారణంగా ఏపీలో చాల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంత వరకు కోవిడ్ నియమాలను పాటించాలన్నారు. ప్రజలు బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని అధికారులు ఎప్పటికి అప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

corona
corona

ఇక ఏపీలో కరోనా వైరస్ కేసులు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు కూడా అత్యల్పంగా నమోదయ్యాయి. అలాగే భారీగా డిశ్చార్జిలు కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలకు పడిపోయింది. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 40,728 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 381 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,68,064కి చేరింది.

అంతేకాదు ఏపీలో కరోనా మరణాలు కూడా భారీగా పడిపోయాయి. సోమవారం కరోనా మహమ్మారి బారిన పడి నలుగురు మరణించారు. అనంతపురం జిల్లాలో ఒకరు, చిత్తూరులో ఒకరు, కృష్ణాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,992కు చేరింది.

అయితే రాష్ట్రంలో డిశ్చార్జిలు సోమవారం భారీగా పడిపోయాయి. సోమవారం 934 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,53,232 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 7,840కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,00,57,857 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించారు.