గ్రేటర్ ప్రచారం ఆ జిల్లా స్థానిక నేతలకు అలా కలిసొచ్చిందట…

-

గ్రేటర్ ఎన్నికలు హైదరాబాద్ లో జరిగితే అదృష్టం మాత్రం ఆదిలాబాద్ నేతలను వరించిందట. ఒక్క అవకాశం కోసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన ఆ నేతలు ఇప్పుడు కాస్త ఎక్కువ హడావిడే చేశారంట. ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలంటు టెంకాయకొట్టే అవకాశం కోసం చూసిన వారికి జీహెచ్ఎంసీ ఎన్నికలు బూస్ట్ ఇచ్చాయంట. ఏ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమం అయినా ఎమ్మెల్యే,మంత్రి,మరి లేదంటే మండల స్థాయి ప్రజాప్రతినిధులే ముందుండే వారు…గ్రామీణ స్థాయి ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలే అన్నట్లు యవ్వారం నడిచిపోయింది..అయితే బడానేతలంతా ప్రచారంలో బీజీ కావడంతో లొకల్ నేతలకు మంచి చాన్స్ దొరికిందంట….

ఆదిలాబాద్ జిల్లాలో చోటా నేతలకు గ్రేటర్ ఎన్నికలతో ఓ సువర్ణావకాశం వచ్చింది. ఇన్నాళ్ల పాటు ప్రారంభోత్సవాలు,భూమి పూజలతోపాటు ఏచిన్న కార్యక్రమం జరిగినా ఆఖరికి గ్రామీణ ప్రాంతాల్లో ఓ ప్రోగ్రాం అయినా కనీసం ఎమ్మెల్యే హజరయ్యేవారు మరి పెద్దదైతే మంత్రి సైతం వచ్చి రిబ్బన్ కట్ చేసేవారు..దీంతో ఎంపిటీసీలు,సర్పంచ్ లకు కనీసం మర్యాద లేకుండా పోయిందంటా…అంతేకాదు గ్రామాల్లో కోనుగోలు కేంద్రాలు,యూరియపంపిణీ సైతం బడానేతలే హడావిడీ చేసేవారు..ఇక ఈ లీడర్లంతా గ్రేటర్ బాట పట్టడంతో …గ్రామీణ ప్రాంత లీడర్లు లక్షలు రూపాయల అభివృద్ది పనులకు చకచకా ప్రారంబోత్సవాలు చేశేసారు.

ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రి,,కార్పోరేషన్ చైర్మన్లు..అన్ని పార్టీల ముఖ్య నేతలు ఆదిలాబాద్ నుంచి హైదరబాద్ బాట పట్టారు. ప్రారంభొత్సవాలున్నాయంటే సులబ్ కాంప్లెక్స్ సైతం ఓపెన్ చేసే ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉండటంతో ఏ చిన్న కార్యక్రమాన్ని ప్రమోట్ చేసుకుందామనుకున్న స్థానిక నేతలకు చిన్న అవకాశం కూడా దక్కేది కాదు. గ్రేటర్ ఎన్నికలే సందు అన్నట్లు పెండింగ్ లో ఉన్న అన్ని పనులను స్థానిక సర్పంచులు,ప్రజాప్రతినిధులు వరుస పెట్టి ప్రారంభోత్సవాలు చేసేసారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం పక్కనే ఉన్న ఓ గ్రామ మహిళ సర్పంచ్ ఈమద్య అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం చేశారు..ఆమె గెలిచిననాటి నుంచి తన చేతులతో పనులు ప్రారంభించడం ఇదే మొదటిసారంటా..దీంతో తమ ఊరికి తామే రిబ్బన్ కట్ చేసాం…జన్మ ధన్యమైందనుకుని స్థానిక నేతలు సంబరపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news