Corona: కరోనా ఎఫెక్ట్… పెరిగిన ఆదాయ అంతరాలు… లాభాలు ఆర్జించిన రంగాలు ఇవే.

-

కరోనా మహమ్మారి ప్రారంభం అయి దాదాపుగా రెండేళ్లు గడిచింది. అయినా దాని పీడ విరగడ కాలేదు. కొత్తకొత్త రూపాలతో ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్, బీఏ 4, బీఏ 5 ఇలా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియా కరోనా కేసులతో అల్లాడుతోంది. ఇదిలా ఉంటే కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. ఆరోగ్య వ్యవస్థలు తీవ్రంగా ఒత్తడిని ఎదుర్కొన్నాయి. తమ సొంత వారిని బతికించుకునేందుకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టీ మరీ వైద్యం చేయించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఉన్న ఆస్తులను అమ్మీ, అప్పులు తెచ్చి ఖర్చు పెట్టినా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు ఎన్నో ఉన్నాయి. 

ఇదిలా ఉంటే.. పేదరికం రూపు మాపడానికి దశాబ్ధాలుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ నిష్ఫలం అయ్యాయని ‘ ఆక్స్ ఫర్డ్’ నివేదిక తెలిపింది. కరోనా సంక్షోభంతో ఈ ఏడాది ప్రతీ 30 గంటలకు ఒక బిలియనీర్ అవతరించగా… ప్రతీ 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది కడు పేదరికంలోకి జారుకున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇంధనం, ఆహారం, జౌషధ రంగాల వ్యాపారలు భారీగా లాభాలను ఆర్జించగా… పెరిగిన ధరలు, సామాజిక, ఆర్థిక సంక్షోభానికి కారణం అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news