నిర్లక్ష్యం ఖరీదు.. ముంచుకొస్తున్న కరోనా ముప్పు.. భార‌త్ 7వ స్థానం

-

కరోనా విషయంలో ఇప్పటికి చాల మందికి ఒక అవగహన లేనట్లుగా ఉంది.. ఎందుకంటే లాక్‌డౌన్ సడలించగానే ఎవరికి తోచిన విధంగా వారు జీవిస్తున్నారు.. ఒక్కరిలో కూడా కరోనా పట్ల భయం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు.. ఇక కరోనా వైరస్ వ్యాపించిన మొదట్లో మనదేశంలో అంతగా కేసులు నమోదు అవలేదు.. కానీ ఇప్పటి పరిస్దితి చూసుకుంటే, ప్రస్తుతం భారతదేశంలో కరోనావ్యాప్తి విషయంలో ఏడోవస్దానంలో ఉందని పేర్కొంటున్నారు.. ఇది ఇలాగే కొనసాగితే మొదటి స్థానం రావడం పెద్ద కష్టమేమీ కాదు.

కాగా ఇప్పటికి దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశలోకి ప్రవేశించలేదని ప్రభుత్వం చెబుతోంది.. అయితే అంటువ్యాధి నిపుణుల సంఘాలు, ప్రజారోగ్య నిపుణులు, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ నిపుణులు మాత్రం దేశంలో కరోనా వైరస్ ఇప్పటికే పెద్ద ఎత్తున సామూహిక వ్యాప్తి దశలోకి చేరిందనే ప్రకటనను సంయుక్తంగా విడుదల చేశారు.. కాగా ఒకదశలో అంటే లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేసిన సమయంలో వైరస్ అదుపులోనే ఉందని, ఎప్పుడైతే లాక్‌డౌన్ సడలింపుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ వైరస్ తీవ్రత ఎక్కువైనట్లు అర్ధమవుతోందని పేర్కొన్నారు. ఇక ఈ వైరస్ వ్యాపిస్తున్న మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం అంటువ్యాధుల నిపుణులను సంప్రదించినట్లయితే, వారు మంచి సేవలు అందించేవారని అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా విధాన నిర్ణేతలైన సాధారణ పరిపాలనా బ్యూరోక్రాట్లపై ఎక్కువగా ఆధారపడి, ఎపిడిమియాలజీ, ప్రజారోగ్యం, ఔషధ రంగాలు, సామాజిక, సాంకేతిక నిపుణులను పక్కన పెట్టిందని, అందువల్ల మానవ సంక్షోభం, వ్యాధి వ్యాప్తి పరంగా భారత్ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడిమియాలజిస్ట్స్ ఘాటుగానే విమర్శిస్తున్నారు..

ఇక కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పుడే వలస కూలీలను వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించినట్లయితే, ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తికాదని వారు పేర్కొన్నారు. ఇక చేతులు కాలాగా ఆకులు పట్టుకుంటే లాభం ఏం ఉండదు, అందుకే ఇక ముందు జరగవలసిన విషయంలో అయినా పారదర్శకంగా వ్యవహరించి మనదేశాన్ని కాపాడుకుంటే చాలని కొందరు అభిప్రాయపడుతున్నారట..

Read more RELATED
Recommended to you

Latest news