దేశంలో లాక్‌డౌన్ సడలింపులు మొదలయ్యాయి.. అలాగే ప్రజల నెత్తిన ధరల పిడుగులు కూడా పడటం ప్రారంభమయ్యాయి.. ఇప్పటికే ఈ వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ నేపధ్యంలో ప్రతి వారికి ఉపాధి కరువై డబ్బుల కోసం అల్లాడుతున్నారు.. ఈ నేపధ్యంలో చమురు సంస్ధలు ప్రజలకు షాక్ ఇచ్చాయి..
ఇకపోతే తగ్గినట్లే తగ్గిన వంట గ్యాస్ ధరను పెంచుతున్నట్లుగా గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి.. కాగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల ప్రభావం వల్ల జూన్ 1వ తేదీ నుంచి భారతదేశంలో పెంచిన కొత్త వంట గ్యాస్ ధరల రేట్లు అమలులోకి వచ్చాయి… ఇక గత నెలలో వంట గ్యాస్ ధర రూ.744 నుంచి రూ.581.50కి తగ్గించారు.. అయితే ప్రస్తుతం సిలిండర్ ధర రూ.100కి పైగా పెరింది..
ఒకసారి సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే.. 14.2 కేజీల నాన్ సబ్సీడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.11.5 పెరిగింది… దీంతో సిలిండర్ ధర రూ.593కి చేరింది. అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.110 పెరిగింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1139కి ఎగసింది.
ఇదిలా ఉండగా గతంలో అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు తగ్గడంతో, గ్యాస్ ధరలు కూడా తగ్గించామని, ప్రస్తుతం అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగాయని, అందువల్ల తామూ పెంచాల్సి వచ్చిందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి.. ఇకపోతే గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే.. మొత్తానికి ఈ పెరుగుదల సామాన్యులకు మాత్రం భారమే..