కరోనా ఇకపై ప్రపంచ విపత్తు కాదు : డబ్ల్యూహెచ్​ఓ

-

చైనాలోని వుహాన్ నుంచి మూడేళ్ల క్రితం బయటకు వచ్చి ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారిని అప్పట్లో ప్రపంచ విపత్తుగా అందరూ భావించారు. అలాగే ఈ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేసింది. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుంటున్నాయి దేశాలన్నీ. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్​పై కీలక ప్రకటన చేసింది.

కొవిడ్‌-19 ఇకపై ప్రపంచ విపత్తు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం ప్రకటించింది. ప్రపంచ విపత్తుగా పరిగణించేంతటి స్థాయిలో దాని ప్రభావం లేదని వెల్లడించింది. గురువారం ఆరోగ్య నిపుణులతో చర్చించిన తర్వాత డబ్ల్యూహెచ్‌వో ఈ ప్రకటన చేసింది. అయితే మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని, ఇప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి ముప్పుగా ఉందని తెలిపింది. దాని బారినపడి ప్రతివారం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. ‘‘మన ప్రపంచాన్ని కొవిడ్‌ మళ్లీ ప్రమాదంలో పడేసే పరిస్థితి ఉందా అన్న విషయంపై నిపుణులతో మరోసారి సమీక్ష జరిపించడానికి నేను వెనుకాడను’’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news