కరోనా తగ్గింది, అయినా జాగ్రత్త…!

-

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా తగ్గింది. తెలంగాణా ప్రభుత్వం ఒక్క కేసు నమోదు కావడంతో రాష్ట్రం మొత్తం విస్త్రుత కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అన్ని విధాలుగా ప్రజలను అలెర్ట్ చేసింది. దీనితో రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగు అయిపోయింది. తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ ఈ విషయంలో ఎక్కడిక్కడ అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటుగా అనుమానితులకు వైద్య పరిక్షలు చేయడం,

కరోనా బాధితుడికి అందించే చికిత్స విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేసింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ అనేది దాదాపుగా లేదు అనే చెప్పాలి. అయినా సరే అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణా ప్రభుత్వం సూచిస్తుంది. విదేశాల నుంచి వచ్చిన వారి పట్ల, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి పట్ల అన్ని విధాలుగా జాగ్రత్తలు అవసరమని చెప్తుంది తెలంగాణా సర్కార్.

ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంటుంది. అక్కడి వారికి కరోనా ఎక్కువగా ఉంది. భారత్ లో దాదాపు 60 కేసులు నమోదు అయ్యాయి. దీనితో విమాన ప్రయాణాలు చేసిన వారి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే ఆస్పత్రికి వెళ్ళాలి అని సూచిస్తున్నారు. ప్రస్తుత౦ కరోనా సోకినా వ్యక్తి కోలుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news