డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా కొత్త వేరియంట్ బీ.ఏ2

-

చైనా వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ రేండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో ప్రపంచంపై దాడులు చేస్తూనే ఉంది. లక్షల మంది ప్రజలు కరోనా వైరస్ కాటుకు బలయ్యారు. మరెంతో మంది ఆర్థికంగా చితికిపోయారు. దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అయ్యాయి. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. 

ఇదిలా ఉంటే ఓమిక్రాన్ లో మరో ఉప వేరియంట్ ను గుర్తించారు. బీ.ఏ2 గా పిలుస్తున్న ఈ వేరియంట్ ఓమిక్రాన్ కన్నా మరింత వేగంగా వ్యాపించే లక్షణం ఉంది. దీంతో మరోసారి ప్రపంచానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. డెన్మార్క్ లోని స్టాటెన్స్ సీరం ఇన్స్టిట్యూట్ పరిశోధకలు ఈ వేరియంట్ ను గుర్తించారు. మనషుల్లోని ఇమ్యూనిటీ నుంచి ఈ వేరియంట్ సులభంగా తప్పించుకోగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ వేరియంట్ ను 56 దేశాల్లో గుర్తించారు. డెన్మార్క్ లో వస్తున్న కేసుల్లో ఈ బీ.ఏ2 వేరియంట్ కేసులే అధికంగా ఉంటున్నాయి.

ఇదిలా ఉంటే కొత్త వేరియంట్ పై మరో శుభవార్తకు కూడా తెలిపారు. వ్యాక్సిన్లు తీసుకుంటే చాలా వరకు ఈ వేరియంట్ నుంచి రక్షణ పొందవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news