కరోనా వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ప్రారంభం.. వచ్చే వారం నుండే..

అస్ట్రజెంకా తయారు చేస్తున్న కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీరం ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. వచ్చే వారం నుండే ఈ ట్రయల్స్ జరగనున్నాయట. ఇప్పటికే రెండు దశల క్లినికల్స్ ట్రయల్స్ పూర్తయ్యాయి. మూడవ దశ ప్రయత్నాల కోసం డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి కూడా లభించింది. ఈ నేపథ్యంలో వచ్చే వారం ట్రయల్స్ జరగనున్నాయి.

ఈ ట్రయల్స్ కి150 నుండి 200మంది వాలంటీర్లు రెడీగా ఉన్నారట. ఆగస్టు 25వ తేదీన రెండవ ట్రయల్స్ నిర్వహించారు. అప్పుడు ఒకానొక వాలంటీర్ కొంత అస్వస్థతకి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మూడవ దశ ట్రయల్స్ మొదలు కాబోతున్నాయి. కరోనా రోజు రోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అందరూ ఎదురుచూస్తున్నారు. మూడవ దశ ట్రయల్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తయితే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందనే దానిపై ఒక స్పష్టత వస్తుందని చెప్పవచ్చు.