తబ్లిగీ జమాత్ పుణ్యమా అని దేశమంతా రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో అతలాకుతలమవుతోంది. దాంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను ‘హాట్‌స్పాట్’లుగా గుర్తించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 334 కాగా, 290 కేసులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నాయి. 33 మంది కరోనా నుంచి విముక్తి కాగా, 11 మంది బలయ్యారు.
నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకుముందు ప్రెస్‌మీట్‌లో ప్రకటించినట్లుగానే జరిగుంటే, ఈపాటికి తెలంగాణ దాదాపుగా కరోనా-ఫ్రీ రాష్ట్రమయ్యుండేది. ఇప్పుడా అవకాశం లేదు. తబ్లిగీ జమాత్ కార్యకర్తలు ప్రతి జిల్లాను కరోనా జిల్లాగా మార్చేసారు. ఇప్పటికే కేసులతో తల్లడిల్లిపోతున్న తెలంగాణ, ఇంకా ఎన్ని వస్తాయో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో విస్తృత సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి, డేంజర్ జోన్‌లో ఉన్న ప్రాంతాలను గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దాని ప్రకారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి, వాటిని పూర్తిగా ఐసొలేట్ చేసారు. ఆ ప్రాంతంలోకి రాకపోకలు వందశాతం నిషేధించారు. ఈ కింద తెలిపినవే ఆ ప్రాంతాలు…
గ్రేటర్ హైదరాబాద్
- యూసఫ్‌గూడ. 2. చంచల్‌గూడ. 3. సికింద్రాబాద్‌లోని ఎంజె రోడ్, 4.నాంపల్లి, 5. ఎమ్మెల్యే కాలనీ, 6.మణికొండ. న్యూ మలక్‌పేట్. 8.నారాయణగూడ. 9.ఖైరతాబాద్. 10.రాజేంద్రనగర్. 11.షాద్‌నగర్. 12.టోలీచౌకీ. 13.కుత్బుల్లాపూర్.
వరంగల్ అర్బన్
- జులైవాడ. 2.సుబేదారి. 3.ఈద్గా 4.కుమార్‌పల్లి 5.మండిబజార్ 6.పోచమ్మమైదాన్ 7.చార్‌బౌలి 8.కాశిబుగ్గ 9.గణేశ్ నగర్ 10.నిజాంపుర 11.లక్ష్మిపురం 12.రంగంపేట్ 13.శంభునిపేట 14.బాపూజీనగర్.
నిజామాబాద్
- ఆర్యనగర్ 2.మాలపల్లి 3.ఖిల్లారోడ్.స్పాట్
పైన తెలిపిన ప్రాంతాలను ప్రస్తుతానికి డేంజర్ జోన్లుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆయా ప్రాంతాలనుండి రాకపోకలు పూర్తిగా నిషేధించింది. నిత్యావసరాలు, కూరగాయలు లాంటివి అక్కడికే సరఫరా చేస్తామని కలెక్టర్లు ప్రకటించారు.