సాధారణ సమయాల్లోనే.. మనకు సహజంగానే.. వాట్సాప్‌లో ఫేక్ వార్తలు ఎప్పుడూ వస్తుంటాయి. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫేక్ వార్తల సంఖ్య మరీ ఎక్కువైంది. ఈ క్రమంలోనే తాజగా వాట్సాప్‌లో WHO (World Health Organisation) చెప్పిందంటూ.. లాక్‌డౌన్ పొడిగింపుపై ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని, ఇది నకిలీ మెసేజ్ అని తేల్చారు.
దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ముందు ప్రధాని మోదీ ఒక రోజు జనతా కర్ఫ్యూను విధించిన సంగతి తెలిసిందే. అయితే WHO చెప్పిన ప్రకారం.. ఏప్రిల్ 20 నుంచి మే 18వ తేదీ వరకు భారత్‌లో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారని.. ఆ మెసేజ్‌లో ఉంది. అయితే ఆ మెసేజ్ నకిలీదని, నిజానికి లాక్‌డౌన్ పొడిగింపుపై WHO భారత్‌కు ఎలాంటి సూచనలు, ఆదేశాలు ఇవ్వలేదని.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తేల్చి చెప్పింది. కనుక WHO చెప్పిందని ప్రచారమవుతున్న ఆ మెసేజ్‌లో నిజం లేదని, అది ఫేక్ న్యూస్ అని.. దాన్ని నమ్మకూడదని.. పీఐబీ చెబుతోంది.
Claim : A so-called circular, said to be from WHO is floating around on whatsapp, saying that it has announced a lockdown schedule.
Fact : @WHO has already tweeted it as #Fake ⬇️https://t.co/GB7rQ0t9lJ pic.twitter.com/3M5RBLoA3i
— PIB Fact Check (@PIBFactCheck) April 5, 2020
కాగా భారత్‌లో సోమవారం వరకు మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 4వేలు దాటగా.. మొత్తం మృతుల సంఖ్య 100 దాటింది. ఇక తెలంగాణలో 300కు పైగా కరోనా కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 252 కరోనా కేసులు నమోదయ్యాయి.