లాక్ డౌన్ పై కొత్త లెక్క‌లు… పెంపు ఖాయం.. ఎందుకంటే..!

-

దేశంలో క‌రోనా విజృంభిస్తోంది. ఆది వారం నుంచి దేశంలో నిజానికి క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆదివా రం కేంద్ర ప్ర‌బుత్వం జ‌న‌తా క‌ర్ఫ్యూ అంటూ ప్ర‌జ‌ల‌ను ఒప్పించింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు స్వ‌చ్ఛం దంగా నిలిచిపోయారు. ఎవ‌రి ఇళ్ల‌లో వారు ఉన్నారు. అయితే, అదే రోజు దేశంలో క‌రోనా పాజిటివ్‌ కేసుల న‌మోదు భారీగా ఉండ‌డంతో ప్ర‌భుత్వం ఆవెంట‌నే లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. ముందుగా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌గా, ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్ర‌బుత్వ‌మే లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డం విశేషం. ఏపీ ప్ర‌భుత్వం వాస్త‌వానికి ఈ నెల 31 వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించింది.

అయితే, దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితిని అంచ‌నా వేసిన కేంద్ర ప్ర‌భుత్వం ఈ లాక్‌డౌన్‌ను మూడు వారాల పాటు అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి దేశాన్ని ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యంలోకి ముంచెత్తింది. దీంతో మిజోరం వంటి ఎలాంటి క‌రోనా ఇన్‌ఫెక్ష‌న్ లేని రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఇక‌, ఈ లాక్‌డౌన్‌తో జ‌న‌జీవ‌నం దాదాపు నిలిచిపోయింది. నిత్యావ‌స‌రాల‌కు ఇబ్బంది లేద‌ని అంటున్నారు.. కానీ, ఒక‌టి రెండు రోజులు అయితే ఫ‌ర్వాలేదు. కానీ, మూడు వారాల పాటు నిత్యావ‌స‌రాల‌ను అందుబాటులో ఉంచ‌డం అనే ది పెద్ద స‌మ‌స్య‌గానే ప‌రిణ‌మించ‌నుంది.

ఇదిలావుంటే, ఇప్ప‌టివ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అనేది మూడు వారాల‌కే ప‌రిమితం కాద‌ని తెలుస్తోంది. దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.. కూడా ఇప్ప టికే 12కు చేరాయి. మ‌రోప‌క్క పాజిటివ్ కేసులు కూడా వంద‌ల సంఖ్య‌లో న‌మోదవుతున్నాయి., ఈ నేప థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అనేది క‌నీసం 100 రోజులు అంటే మూడు మాసాలు కొన‌సాగుతుంద‌ని అం టున్నారు.  అయితే, ఈ విష‌యాన్ని ఇప్ప‌టికిప్పుడు వెల్ల‌డించ‌కుండా.. విడ‌త‌ల వారిగా ప్ర‌జ‌ల‌ను సిద్ధం చేసే ఉద్దేశంతో వారాలుగా ప్ర‌క‌టిస్తున్నార‌నేది కేంద్రం నుంచి వ‌స్తున్న స‌మాచారం.

దీనికి బ‌లం చేకూరుస్తున్న‌ట్టుగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల కూడా అన్ని ర‌కాల ఉద్దీప‌న‌ల‌ను జూన్ 30 వ‌ర‌కు పెంచ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి లాక్‌డౌన్ ఇప్పుడిప్పుడే స‌మ‌సిపోయేది కాదు. అయితే, దీనికి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండాల్సిన అవ‌స‌రం మాత్రం ఎంతైనా ఉంది.  స‌మ‌స్య మ‌న‌దైన‌ప్పుడు.. మ‌న‌మే ప‌రిష్క‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌భుత్వాల చ‌ర్య‌ల‌పై ఆవేశం, ఆగ్ర‌హం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

Read more RELATED
Recommended to you

Latest news