కోవాక్సిన్: రెండవ దశలోకి ఎంటర్ అయిన భారత్ బయోటెక్..

కోవిడ్ విజృంభణ పెరుగుతున్న వేళ అందరూ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ వల్ల జీవితాలు అస్తవ్యస్తం కావడంతో పాటు చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా కొన్ని వ్యాపార సంస్థలు వాటి వ్యవహారాలు మొదలు కానందున ఆర్థికంగా తీవ్రనష్టం వాటిల్లింది. అవసరమున్నా కూడా బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ పోవాలంటే ఒకే ఒక్క మార్గం కరోనాకి వ్యాక్సిన్ రావడం. ప్రపంచ వ్యాప్తంగా వైద్యశాస్త్రవేత్తలందరూ అహర్నిశలు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

భారతదేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో అందరికీ తెలిసింది చెప్పుకోదగ్గది భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవ్యాక్సిన్.
ఐతే ప్రస్తుతం కోవ్యాక్సిన్ నుండి శుభవార్త బయటకి వచ్చింది. మొదటి దశ ట్రయల్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. మొదటి దశలో కోవ్యాక్సిన్ డోస్ తీసుకున్న వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. అదీ గాక ఆంటీబాడీస్ బాగా డెవలప్ అయ్యాయట. దాంతో సక్సెస్ ఫుల్ గా రెండవ దశ ట్రయల్స్ స్టార్ట్ చేయనున్నారు.

రెండవ దశ పూర్తికాగానే మూడవ దశలోకి, ఆ తర్వాత అంతా కరెక్ట్ గా ఉంటే మార్కెట్లోకి కోవ్యాక్సిన్ విడుదల కానుంది. కాకపోతే దానికి చాలా టైమ్ పడుతుందని భారత్ బయోటెక్ అభిప్రాయపడుతోంది. ఏదైతేనేం కోవ్యాక్సిన్ తయారీలో మొదటి అడుగు సక్సెస్ అయిందంటే అంతకంటే ఇంకేం కావాలి.