విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కరోనా విషయంలో చాలా లైట్ తీసుకుంటున్నారు ప్రస్తుతం. మాకు ఎందుకు ఉంటుంది అనే భావనలో ఉండి చాలా మంది జలుబు లేదు ఏమీ లేదని ఇళ్ళకు వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. కాని అలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శనివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ వాళ్లకు దండం పెట్టారు.
దయచేసి వచ్చి లొంగిపోవాలని చికిత్స చేస్తారని సూచించారు. కాని చాలా మంది మాత్రం పరిస్థితి ఎంత మాత్రం అర్ధం చేసుకునే పరిస్థితి కనపడటం లేదనే చెప్పాలి. ఎక్కడా కూడా జనం మాట వినడం లేదు. విదేశాల నుంచి వచ్చి చెకింగ్ లేని చోట నుంచి ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల నుంచి ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని మన లోకం దండం పెట్టి అడుగుతుంది. దయచేసి లైట్ తీసుకోవద్దు.
మీ పుణ్యం ఉంటుంది… మన జాతిని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన గ్రామాన్ని, మన కుటుంబాన్ని అందరూ కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. విదేశాల్లో ఎంతో విలాస వంతమైన జీవితం అనుభవించి ఉంటారు కదా. కానీ ఇక్కడ అమాయక పేదలు ఎందరో బ్రతుకుతున్నారు. దయచేసి వాళ్ళ జీవితాలను కాపాడండి. దయచేసి వెళ్లి చెకప్ చేయించుకోవడం అనేది అందరికి మంచిది.
కరోనా వైరస్ అనేది మహమ్మారి, చూస్తుండగానే కమ్మేస్తుంది. మన అందరం దాని మాటే వింటున్నాం ఇప్పుడు. కాబట్టి మీకు దండం పెట్టి అడుగుతున్నాం వెళ్ళండి. వెళ్లి చెకప్ చేయించుకుని, క్వారంటైన్ లో ఉండండి. మీకు వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. మిమ్మల్ని కొట్టరు తిట్టరు, కేసులు ,కోర్టులు గోల ఉండదు. మీ కుటుంబాన్ని కాపాడుకోండి యావత్ భారత దేశాన్ని రక్షించండి. మీకు దండం పెట్టి అడుగుతున్నాం మళ్ళీ మళ్ళీ.