ఫైజర్ వ్యాక్సిన్ రెడీ అయినా… ఇప్పట్లో ఇవ్వడం కష్టమే…!

జర్మన్ బయోటెక్ సంస్థ బయోఎంటెక్ సహకారంతో ఫైజర్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని… ప్రజలకు ఇవ్వడం సాధ్యం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ ను అడ్డుకోవడంలో 90 శాతానికి పైగా వ్యాక్సిన్ పని చేస్తుంది అని సంస్థ ప్రకటన చేసింది. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఇది ఒక పెద్ద పురోగతి.

అయితే ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ స్థానిక ఫార్మసీలలో సాధారణ ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. ఇది ఎంత వరకు భద్రం అనే దాని మీద ఇప్పుడు లెక్కలు వేస్తున్నారు. ఈ డేటా వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేస్తారు. వ్యాక్సిన్ ని నిల్వ చేసుకోవడానికి గానూ తగిన విధంగా వనరులు లేవు. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి అత్యవసర వినియోగ అనుమతి కోసం ఈ నెల చివరిలో అనుమతి ఇస్తారు. మంజూరు చేస్తే, వారు ఈ సంవత్సరం 50 మిలియన్ మోతాదుల వరకు విడుదల చేయవచ్చని కంపెనీలు అంచనా వేస్తున్నాయి, ఇది 25 మిలియన్ల ప్రజలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉంది.