ఒకే మాస్క్‌ని తరచూ ఉపయోగించినా.ఎక్కువ సేపు పెట్టుకున్నా ప్రమాదమేనట..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి కాపాడుకోవాడనికి మాస్కే ముఖ్యం అని అందరూ చెబుతున్నారు. మాస్కుల్లో రకరకాలు ఉన్నాయి. వేరియంట్ల తర్వాత వేరియంట్లు దిగుతున్నాయి. మనకు మాత్రం మాస్కు విషయంలో సరైన అవగాహన లేదు. కొందరైతే..మాస్కులను గంటే కదా వేసుకున్నది ఉతకకుండా వాడేయటం, మరికొందరు వాషింగ్ మిషన్ లో వేసి ఉతకడం చేస్తున్నారు. చాలామందికి ఏ మాస్కు వాడాలి అనేది కూడా సరిగ్గా అవగాహన లేదు. క్లాత్ మాస్కును డ్రెస్ కు మాచింగ్ వేస్తున్నారు. ఇవి వైరస్ నుంచి ఏమాత్రం రక్షణ కల్పించవని ఈమధ్యనే పరిశోధనలో తేలింది..ఇంకొందరు ఒకటే మాస్క్ ను ఎక్కువసేపు వాడుతారు. ఇది కూడా మంచిదికాదట. ఒకే మాస్క్ ధరించటం వల్ల వచ్చే నష్టాల గురించి తాజా అధ్యయనాలు కొన్ని విషయాలు చెప్పాయి అవేంటంటే..

చర్మ సమస్య…

ఎక్కువ సేపు ఒకే మాస్క్ వేసుకోవడం వల్ల చర్మానికి అలర్జీలు వస్తాయని చెబుతున్నారు. అందువల్ల చర్మంపై దురద వంటి సమస్యలకు అనుకూలంగా మారుతుంది.

సంక్రమణ ప్రమాదం పెరిగింది..

ఒకే మాస్క్‌ని తరచుగా ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ఇన్‌ఫెక్షన్ పెరుగుదలకు దారితీస్తుందట. ఎందుకంటే వైరస్ మీ ముఖానికి అంటుకుంటుంది. అలాంటి సమయంలో మాస్క్‌ను కడుక్కోకపోతే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది.

ఇది బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణం అవ్వొచ్చు
అపరిశుభ్రమైన ముసుగులు మైకోరైజల్ ఇన్ఫెక్షన్ అంటే..బ్లాక్ ఫంగస్ కు దోహదపడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది నిజమో కాదో అధికారికంగా ఇంకా నిర్థారణ కాలేదు.

ఒకసారి ఉపయోగించిన తర్వాత పారవేయగల సర్జికల్ మాస్క్‌లను ఎంచుకోవడం ఉత్తమం. మీ చర్మం చాలా సున్నితంగా ఉంటే, మళ్లీ ఉపయోగించే కాటన్ మాస్క్‌లను ఎంచుకోండి. కానీ ఒకసారి ఉపయోగించిన మాస్క్‌ను మళ్లీ కడుక్కోకుండా ధరించకూడదు. దీన్ని బాగా శుభ్రం చేసే వాడుకోవాలి

అన్నింటికంటే..N-95మాస్కులు ఉత్తమం అనే డాక్టర్లు వెల్లడించారు. వీటని పెట్టుకోవడం కాస్త కష్టమైనా సరే..వైరస్ నుంచి ఇదే మనల్ని బాగా కాపాడుతుంది. శుభ్రత కూడా చాలా ముఖ్యం. మాస్కులను ఎప్పటికీ..అన్నీ బట్టలతో కలిపి ఉతకకూడదు. వేడినీటిలో వేసి కాసేపు ఉంచి అప్పుడు క్లీన్ చేయాలి. సర్జికల్ మాస్క్ ను వాడేసిన తర్వాత పారేయండి. ఎట్టిపరిస్థితుల్లో వాటిని తిరిగి వాడే ప్రయత్నం చేయొద్దు.

– Triveni Buskarowthu