వ్యాక్సిన్ వచ్చినా.. అతను అందనివ్వడు: ట్రంప్

-

అగ్రరాజ్యం అమెరికాలోని దిగ్గజ సంస్థ ఫైజర్ కరోనా టీకా పై విడుదల చేసిన ప్రకటనతో ప్రజలు కొంత ఊరట పొందుతున్నారు. అయితే శుక్రవారం ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. ఫైజర్ వ్యాక్సిన్‌ డిసెంబర్ చివరికి టీకా విడుదల కావొచ్చని ట్రంప్ అన్నారు. కానీ, అత్యావసర వినియోగానికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ నాటికి అమెరికన్లందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్‌తో కలిసి అమెరికన్ ఫైజర్ సంస్థ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.

trump
trump

వ్యాక్సిన్ పంపిణి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన న్యూయార్క్ రాష్ట్రానికి మాత్రం వేగంగా వ్యాక్సిన్ అందకపోవచ్చని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో భయం వల్లే ఆలస్యమవుతందని ఆరోపించారు.

యూఎస్ ఔషధ సంస్థల సామర్ధ్యంపై ఆయన భయపడుతున్నారని తెలిపారు. వ్యాక్సిన్ పని సామర్థ్యంపై కూడా ఆయనకు అనుమానం ఉందన్నారు. అందుకే వ్యాక్సిన్ను ప్రజలకు పంపిణీ చేయకుండా అతని పరిపాలన విభాగం అడ్డుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫైజర్ సంస్థ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చిన న్యూయార్క్ ప్రజలకు అందదేమో అని విచారం వ్యక్తం చేశారు. కాబట్టి క్యూమో ఒక నిర్ణయానికి రావాలని సూచించారు అప్పుడే వ్యాక్సిన్ త్వరగా అందించడానికి వీలు పడుతుందని” ట్రంప్ అన్నారు. అయితే టీకా ఉత్పత్తిలో యూఎస్ ఔషధ సంస్థలు పాలుపంచుకున్న విషయం తెలిసిందే.

ట్రంప్ వ్యాఖ్యల పై స్పందించిన క్యుమో.. అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు న్యూయార్క్‌పై ఆయనకు ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోవటం వల్లే ఇలా అంటున్నారని అన్నారు. తాను ఓడిపోయినందునే న్యూయార్క్ కు వ్యాక్సిన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు మాత్రం వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news